ధరలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం
ABN , First Publish Date - 2021-03-25T04:30:12+05:30 IST
రోజురోజుకు ప్రజల పట్ల గుదిబండగా మారి ఆకా శాన్ని అంటుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధర లు అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సీపీఐ రాష్ట్ర నాయకుడు వార్ల వెంకటయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్‌లు విమర్శించారు.

- సీపీఐ రాష్ట్ర నాయకుడు వార్ల వెంకటయ్య
తాడూరు, మార్చి24: రోజురోజుకు ప్రజల పట్ల గుదిబండగా మారి ఆకా శాన్ని అంటుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సీపీఐ రాష్ట్ర నాయకుడు వార్ల వెంకటయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్‌లు విమర్శించారు. తాడూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని, వంద ఏళ్ల కింద పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరిస్తూ పెట్టుబడిదారులు, యాజమాన్య ప్రయోజనాల కోసం వాటిని మారుస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయ డం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీన రైతన్న పోరాటానికి సంఘీభావంగా, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్‌బంద్‌లో ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువకులు, వ్యాపారులు, ఉద్యోగు లు అన్ని వర్గాల ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ముభరత్, సీపీఐ మండల కార్యదర్శి నిరంజన్‌గౌడ్, నాయకులు చంద్రయ్యగౌడ్, కే సత్యం, కే శ్రీనివాసులు, ఎస్.నీలయ్య, శ్రీశైలం, రాముడు, కురుమయ్య, కొండన్నగౌడ్, బసవయ్య, భాస్కర్, ఎల్లయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.