ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం: బీజేపీ

ABN , First Publish Date - 2021-05-25T04:51:05+05:30 IST

వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ సీనియర్‌ నాయకుడు నాగూరావు నామాజీ అన్నారు.

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం: బీజేపీ
రైతుగోస దీక్షలో ఉన్న నాగూరావు నామాజీ

నారాయణపేట/టౌన్‌/మాగనూరు/ధన్వాడ/ కోస్గి/మక్తల్‌, మే 24: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ సీనియర్‌ నాయకుడు నాగూరావు నామాజీ అన్నారు. రైతు గోస బీజేపీ పోరు దీక్షలో భాగంగా పోమవారం ఆయన నివాసం లో దీక్ష చేపట్టగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ నివాస్‌ కోటకొండలోని తన నివాసంలో దీక్షను చేపట్టారు. ఇతర నాయకులు తమ ఇళ్లలో ఉద యం 10 గంటల నుంచి ఒంటి గంటల వరకు దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రైతులకు గన్నీ బ్యాగులు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విక్రయానికి తెచ్చిన ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతుంద న్నారు.   ప్రభుత్వం చిత్తశుద్ధితో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయాలని  డిమాండ్‌ చేశా రు. బీజేపీ పోరు దీక్షలో రాష్ట్ర, జిల్లా నాయకు లు సత్యయాదవ్‌, ప్రభాకర్‌వర్ధన్‌, రఘువీర్‌ యాదవ్‌, నర్సింగ్‌ రాథోడ్‌, లక్ష్మీ శ్యాంసుందర్‌, సత్యరఘుపాల్‌, డాక్టర్‌ సాయిబాబా, నరసిం హా, సాయిబన్న, పుర కౌన్సిలర్లు పాల్గొన్నారు. మాగనూరులో   బీజేపీ మండల అధ్యక్షుడు జ యనంద్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఆశోక్‌గౌడ్‌, కనకరాజు, సర్పంచ్‌ నారాయణ, ధన్వాడ మం డలంలో జడ్పీటీసీ సభ్యురాలు విమల అంజి యాదవ్‌, కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జట్రం గోవర్ధన్‌గౌడ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ పి. రాం చంద్రయ్య, బీజేపీ ఉపాధ్యక్షుడు కుర్వ మల్ల య్య, ఎంపీటీసీ మాధవి, కోస్గిలో బీజేపీ నాయ కులు వెంకటేశ్‌, బీడీల శ్రీకాంత్‌ , మక్తల్‌లో  బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మంజునాథ్‌,   బీజేపీ నాయకులు కర్నిస్వామి, కల్లూరి నాగప్ప, బాల్చెడ్‌ మల్లికార్జున్‌, జయానంద్‌రెడ్డి, సోమశే ఖర్‌గౌడ్‌, ఆశోక్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-25T04:51:05+05:30 IST