నిరుద్యోగులను మోసగించిన ప్రభుత్వం : బీజేపీ
ABN , First Publish Date - 2021-02-27T04:10:24+05:30 IST
విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను మోసగించిన టీఆర్‌ఎస్‌కు పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి అన్నారు.

వనపర్తి అర్బన్, ఫిబ్రవరి 26: విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను మోసగించిన టీఆర్‌ఎస్‌కు పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ, గ్రామీణ మండలా ల పచ్చీస్ ప్రభారీలకు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా రాజవర్ధన్ రెడ్డి, అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి హాజ రై మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు భారీ మెజార్టీతో గెలి పించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కా ర్యవర్గ సభ్యులు బి. కృష్ణ, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయ ణ, మాధవరెడ్డి, రామన్‌గౌడ్, కేతూరి బుడ్డన్న, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి జ్యోతిరమణ, జిల్లా ఉపాధ్యక్షులు సుమిత్రమ్మ, సీతారాములు, నాయకులు పర శురామ్, పెద్దిరాజు, కల్పన, కుమార్, కరీం, ప్రభాకర్, సర్పంచులు పాల్గొన్నారు.
గోపాల్‌పేట మండలంలో ...
గోపాల్‌పేట: మండలకేంద్రంలో శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు అ రవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి జిం కల కృష్ణయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మాధవ రా వు, మండల కార్యదర్శి దిలీప్, తిరుపతిరెడ్డి, శివరాజు పాల్గొన్నారు.
రేవల్లి మండలంలో..
రేవల్లి: మండల పరిధిలోని రేవల్లి, చెన్నారం గ్రామాల్లో శుక్రవారం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు తరుఫున ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మనివర్ధన్, శ్రీశైలం, అజయ్‌గౌడ్, బొక్కలయ్య, బీరయ్య, రవీందర్ పాల్గొన్నారు.