సీతాఫలానికి భలే గిరాకీ

ABN , First Publish Date - 2021-10-30T03:54:15+05:30 IST

సీతాఫలం.. పేదోళ్ల ఆపిల్‌గా పిలిచే ఈ ఫలానికి ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నది.

సీతాఫలానికి భలే గిరాకీ
ఎస్పీ కార్యాలయం పక్కన రోడ్డు వెంట విక్రయానికి ఉంచిన సీతాఫలాలు

 సీతాఫలం.. పేదోళ్ల ఆపిల్‌గా పిలిచే ఈ ఫలానికి ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నది. ఏటా వర్షాకాలం చివరి దశలో ఇవి లభిస్తాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు రోడ్డు పక్కన ఈ పండ్లు, కాయలను విక్రయిస్తున్నారు. నవాబ్‌పేట, హన్వాడ, జడ్చర్లకు చెందిన రైతులు సమీప అటవీ ప్రాంతం నుంచి వీటికి తీసుకొస్తున్నారు. ప్లాస్టిక్‌ టబ్బుల్లో ట్రేలలో తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఒక్కో టబ్బును రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. వీటిని కొనేందుకు పట్టణ ప్రజలు ఎగబడుతున్నారు.

- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, మహబూబ్‌నగర్‌





Updated Date - 2021-10-30T03:54:15+05:30 IST