బహుజనుల ఉనికిని చాటుదాం

ABN , First Publish Date - 2021-11-24T04:33:07+05:30 IST

రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజ నులందరూ ఏకతాటిపై నిలిచి పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలని బీఎస్పీ పట్టణ బాధ్యుడు యామని సుంకన్న అన్నారు.

బహుజనుల ఉనికిని చాటుదాం
అలంపూరులో కేక్‌ కట్‌ చేస్తున్న బీఎస్పీ నాయకులు

- బీఎస్పీ నాయకుల పిలుపు

- ఘనంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ జన్మదిన వేడుకలు 

అలంపూరు/ ఇటిక్యాల/ ఎర్రవల్లి చౌరస్తా, నవంబరు 23 : రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజ నులందరూ ఏకతాటిపై నిలిచి పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలని బీఎస్పీ పట్టణ బాధ్యుడు యామని సుంకన్న అన్నారు. బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ జన్మ దినం సందర్భంగా మంగళవారం అలంపూర్‌ పట్టణంలో వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ప్రవీణ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుంకన్న మాట్లాడుతూ అత్యున్నత మైన ఉద్యోగాన్ని వదిలి బహుజనులను ఏకం చేసేందుకు ప్రవీణ్‌కుమార్‌ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి ధ్యే యంగా, ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన ఆయన ఆశయాల సాధనకు మనమంతా కష్టపడి పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మంగళవారం బీఎస్పీ నాయకులు రోగులకు పం డ్లు, బెడ్లు, పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకం బాబు, గ్రామ అధ్యక్షుడు దివాకర్‌, స్వేరోస్‌ నాయ కులు సుబ్బన్న, జోనల్‌ నాయులు వీరసింహ, సునీల్‌, ప్రకాశం, ఏసేపు, ఆనంద్‌రాజ్‌, నాగరాజు, కొండయ్య, గురువయ్య పాల్గొన్నారు. 


- బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు రాంబాబు, బీసన్న, రంజిత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T04:33:07+05:30 IST