ఘనంగా దీపావళి వేడుకలు

ABN , First Publish Date - 2021-11-06T04:48:58+05:30 IST

దీపావళి పర్వ దినాన్ని జిల్లా ప్రజలు గురువారం ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఘనంగా దీపావళి వేడుకలు
అయిజలో బాణసంచా కాల్చుతున్న యువతులు

- భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి పూజలు

- నోములు, వ్రతాలు ఆచరించిన మహిళలు 

- పటాకుల మోతతో మార్మోగిన గ్రామాలు, పట్టణాలు

గద్వాల టౌన్‌/ అలంపూర్‌/ గట్టు/ వడ్డేపల్లి/ కేటీదొడ్డి/ అయిజ, నవంబరు 5 : దీపావళి పర్వదినాన్ని జిల్లా ప్రజలు గురువారం ఉత్సాహంగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సారి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ప్రజ లు ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఇళ్ల ముందు, ప్రహరీలపై వరుసగా దీపాలను వెలిగిం చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వ్యాపారులు లక్ష్మీదేవి పూజలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు ఇళ్లల్లో నోములు, వ్రతాలు ఆచరించారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. యువతీయువకులు, చిన్నారులు ఉత్సాహంగా బాణసంచా పేల్చి సంబురాలు జరు పుకున్నారు. అలంపూర్‌, కేటీదొడ్డి, అయిజ మండలాల్లో ప్రజలు దీపావళిని ఉత్సాహంగా జరుపుకున్నారు. గట్టు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు దీపాలను వెలిగించి, టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. వడ్డేపల్లి మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌తో పాటు గ్రామాల్లో దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. 



Updated Date - 2021-11-06T04:48:58+05:30 IST