గద్వాల ట్రాన్స్‌కో ఎస్‌ఈ చక్రపాణి బదిలీ
ABN , First Publish Date - 2021-05-09T03:45:09+05:30 IST
గద్వాల ట్రాన్స్‌కో ఎస్‌ఈగా పని చేస్తున్న చక్రపాణిని హైదరాబాద్‌కు బదిలీ అయినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.

గద్వాల, మే 8 ( ఆంధ్రజ్యోతి): గద్వాల ట్రాన్స్‌కో ఎస్‌ఈగా పని చేస్తున్న చక్రపాణిని హైదరాబాద్‌కు బదిలీ అయినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా ఎస్‌ఈ విధులు నిర్వర్తించారు. హైదారబాద్ ట్రాన్స్‌కో కార్పొరేట్ కార్యాలయంలో ఎనర్జీ అడిట్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేస్తున్న ట్రాన్స్‌కో మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల ఒకటి నుంచి ఎస్‌ఈ చక్రపాణి సెలవులో ఉన్నారు. ఈ నెల 15 వరకు సెలవు ఉంది. కానీ సెలవులను రద్దు చేసుకొని వచ్చి విధుల్లో చేరాలని ఆదేశించారు. గద్వాల జిల్లాలో ట్రాన్స్‌లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. విధుల నిర్వహణ లో నిర్లక్ష్యం వహించిన చాలా మంది సిబ్బందికి మెమోలు ఇచ్చారు. దీనికి తోడు ట్రాన్స్‌కో డీడీల కుంభకోణాన్ని కూడా వెలికి తీశారు. రాజకీయ నాయకుల ఒత్తిడిలకు లొంగకుండా ముందుకు సాగుతున్న ఎస్‌ఈని కొందరు సంస్థలో పని చేసే వారే బదిలీ చేయించారనే ప్రచారం సాగుతోంది.