పేదల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-12-08T05:00:58+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల కష్టాలు తెలిసిన నాయకుడు అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

పేదల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్‌
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

ధరూరు, డిసెంబరు 7 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల కష్టాలు తెలిసిన నాయకుడు అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ధరూరు మండలంలోని ఓబులోనిపల్లి, ర్యాలంపాడు, మార్లబీడు, బూరెడ్డిపల్లె, ధరూరు, జాంపల్లె గ్రామాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ నిరుపేద ఇంటికి సీఎం కేసీఆర్‌ పెద్దన్నలా అండగా నిలుస్తున్నా రన్నారు. ఆడపిల్లలకు పెళ్లి కానుకగా మొదట రూ.50 వేలు, తర్వాత రూ.75 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ర్యాలంపాడు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త దుబ్బన్నను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నజుమున్నిసాబేగం, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ వెంకటేశ్వర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌లు బండ్లజ్యోతి, సుజాత, పద్మ, నాగన్న, గణపతి, ఎంపీటీసీ సభ్యుడు దౌలన్న, వ్యవసాయ మార్కెట్‌ డైరెక్టర్‌ నర్సింహులు, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు చిట్టెం పురుషోత్తమ్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జాకీర్‌, బండ్ల విజయ్‌, భీంరెడ్డి, జిల్లా సమన్వయకర్త రామకృష్ణ నాయుడు పాల్గొన్నారు. 


    - ర్యాలంపాడు, బూరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అందించారు. దౌ లన్నకు చికిత్స నిమిత్తం రూ.60వేలు, నాగేశ్వర్‌రెడ్డికి రూ.70 వేలు మంజూరైనట్లు తెలిపారు. 

Updated Date - 2021-12-08T05:00:58+05:30 IST