టీబీ బాధితుల గుర్తింపులో రాష్ట్రంలో గద్వాల ప్రథమ స్థానం
ABN , First Publish Date - 2021-03-25T03:44:41+05:30 IST
టీబీ బాధితులను గుర్తించి, చికిత్స అందించ డంలో గద్వాల జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం లభించింది.

గద్వాల క్రైం, మార్చి 24 : టీబీ బాధితులను గుర్తించి, చికిత్స అందించ డంలో గద్వాల జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం లభించింది. దేశంలో మూ డవ స్థానం దక్కింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వ హించిన ఓ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ చందూనాయక్‌ను హె ల్త్ కమిషనర్ వాకిటి కరుణ పురస్కారం అందించి సత్కరించారు.