చేనేత అభివృద్ధికి నిధులు మంజూరు

ABN , First Publish Date - 2021-03-23T04:31:47+05:30 IST

చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నాబార్డు సీజీఎం వైకే. రావు తెలిపారు.

చేనేత అభివృద్ధికి నిధులు మంజూరు
చేనేత సదస్సులో మాట్లాడుతున్న నాబార్డు సీజీఎం వైకే. రావు

- నాబార్ట్‌ సీజీఎం వైకే రావు 

అమరచింత, మార్చి 22: చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నాబార్డు సీజీఎం వైకే. రావు తెలిపారు. సోమవారం అమరచింతలోని పద్మశాలి భవన్‌లో అమరచింత సిల్క్‌ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ఆ ధ్వర్యంలో కార్మికులకు అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా వైకే. రావు మాట్లాడు తూ చేనేత కార్మికులకు ఆర్థికంగా ఎదగడానికి ఆధునిక పద్ధతుల ద్వారా చేనేత పరిశ్రమ అభివృ ద్ధికి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఎంఎస్‌ఎంఈ నుంచి చేనేత పరిశ్రమ ఉత్పత్తి భవన నిర్మాణానికి  రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని, అదే విధంగా నాబార్డు నుంచి 27 లక్షల నిధులు  ద్వారా నిర్మాణం అవుతుందని తెలిపారు. త్వరలోనే ఈ భ వన నిర్మాణం పూర్తయైు కార్మికులకు అక్కడనే మ గ్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికులు ఎలాం టి అపోహలకు తావివ్వకుండా సంఘటితంగా ఉం డి పరిశ్రమను అభివృద్ధి చేసుకొ ని ఆర్థికంగా బాగు పడాలని కోరారు. భవిష్యత్తులో కార్మికులందరూ ఇంకా చాలా ప్రయోజనాలు పొందుతారని వెల్లడిం చారు. కార్మికులు ఉత్పత్తి చేసిన జర్సీ చీరలకు మార్కెట్‌ సౌకర్యం కల్పించి లాభాలు వచ్చేటట్లు ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో నాబార్డు జీఎం జేఎస్‌ ఉపాధ్యాయ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డీజీఎం వెంకటేశ్వర్‌రావు, నాబార్డు ఏజీఎం అమితాభార్గవ్‌, ఎల్‌డీఎం సురేష్‌ కుమార్‌, సీఈవోలు  పాల్గొన్నారు.

Updated Date - 2021-03-23T04:31:47+05:30 IST