మెడికల్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే

ABN , First Publish Date - 2021-11-24T04:08:25+05:30 IST

మహబూబ్‌నగర్‌ సమీపంలోని మెడికల్‌ కళాశాలలో మంగళవారం ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. మొదటి సంవత్సర విద్యార్థులకు సీనియర్లు ఘన స్వాగతం పలికారు.

మెడికల్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే
నృత్యం చేస్తున్న విద్యార్థినులు

మహబూబ్‌నగర్‌ వైద్యవిభాగం, నవంబరు 23: మహబూబ్‌నగర్‌ సమీపంలోని మెడికల్‌ కళాశాలలో మంగళవారం ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. మొదటి సంవత్సర విద్యార్థులకు సీనియర్లు ఘన స్వాగతం పలికారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 2020 డిసెంబర్‌లో ప్రవేశం పొందినా, కొవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నందున ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ బోధన ప్రారంభం కావడంతో ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ పుట్టశ్రీనివాస్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.రాంకిషన్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సునందిని డాక్టర్‌ నవకళ్యాణి, డాక్టర్‌ రమాదేవి, డాక్టర్‌ గీతా మీనాక్షి పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T04:08:25+05:30 IST