అవకతవకలపై విచారణ జరపాలి

ABN , First Publish Date - 2021-12-26T05:41:23+05:30 IST

టీచర్ల జి ల్లాల కేటాయింపుల్లో అవకత వకలపై తక్షణం విచారణ జరి పించి అందరికీ న్యాయం చే యాలని టీపీఆర్‌టీయూ వ్యవ స్థాపక అధ్యక్షుడు జీ.హర్షవర్థన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

అవకతవకలపై విచారణ జరపాలి
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న టీపీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి

- టీపీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి


మహబూబ్‌నగర్‌ (కలెక్టరే ట్‌), డిసెంబరు 25 : టీచర్ల జి ల్లాల కేటాయింపుల్లో అవకత వకలపై తక్షణం విచారణ జరి పించి అందరికీ న్యాయం చే యాలని టీపీఆర్‌టీయూ వ్యవ స్థాపక అధ్యక్షుడు జీ.హర్షవర్థన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావును కలిసి డిమాండ్లతో కూడిన వినతిప త్రం అందజేశారు. ఇదే అంశంపై అదనపు కలెక్టర్‌ సీతారామారావు, డీఈవో ఉషారాణిని సైతం కలిసి కేటాయింపులు, బదిలీలు తదితర అంశాలపై చర్చించారు. నాలుగు రోజులుగా డీఈవో కార్యాలయంలో ఈ పొరపాట్లపై 2900 మంది ఉపాధ్యాయులు ఫిర్యాదులు చేశార ని తెలిపారు. ఆ ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. సబ్జెక్టుల వారీగా, కేడర్‌ వారీగా సీనియార్టీ లిస్టు వెలువరించి అలాట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై కలెక్టర్‌ చొరవ తీసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి మరో నాలు గు రోజులు సమయం తీసుకొని ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-12-26T05:41:23+05:30 IST