ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో మత్స్యకార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-15T05:38:15+05:30 IST

మత్స్య పారిశ్రామిక సహ కార సంఘం సభ్యులు, కార్మికులు ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో మత్స్యకార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి

వనపర్తి అర్బన్‌, డిసెంబరు 14: మత్స్య పారిశ్రామిక సహ కార సంఘం సభ్యులు, కార్మికులు ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 115 సంఘాలు, 8700 మంది మత్స్య పారిశ్రామిక సహాకార సం ఘం సభ్యులు ఉన్నారని అన్నారు. వీరిలో 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న వారు కార్మిక బీమా పథకం కింద గుర్తింపు కా ర్డులు పొందేందుకు అర్హులని తెలిపారు. ఆకస్మిక, ప్రమాదం జరిగిన, అంగవైకల్యం ఏర్పడినా బీమా వర్తిస్తుందని తెలిపా రు. ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసుబుక్‌కు లింకు ఉన్న ఫోన్‌ నంబర్‌తో మీ సేవలో దరఖాస్తు  చేసుకోవాలని సూచించా రు. నమోదు చేసుకున్న వెంటనే 12 అంకెల కార్డు జారీ చేయబడుతుందని తెలిపారు.  



Updated Date - 2021-12-15T05:38:15+05:30 IST