గన్నీ బ్యాగుల కోసం రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2021-05-06T04:53:25+05:30 IST
మండలంలోని వివిధ గ్రామాలకు చెం దిన రైతులు బుధవారం గన్నీ బ్యాగుల కోసం స్థానిక అం బేద్కర్ చౌరస్తాలో రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వ హించారు.

మక్తల్, మే 5 : మండలంలోని వివిధ గ్రామాలకు చెం దిన రైతులు బుధవారం గన్నీ బ్యాగుల కోసం స్థానిక అం బేద్కర్ చౌరస్తాలో రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వ హించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మా ట్లాడుతూ నెల రోజుల నుంచి గన్నీబ్యాగుల కోసం తి రుగు తుండగా సంబంధిత అధికారులు బ్యాగులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పలుకుబడి ఉన్న వారికి ఇస్తున్నారని ఆరోపించారు. రాత్రి వచ్చి వ్యవసాయ కార్యాలయం వద్ద పడుకొని ఉదయం చెప్పులు క్యూలో ఉంచి నిలబడ్డామన్నారు. ఎస్సైతో పాటు పలువురు అధికా రులు నచ్చజేప్పినా కలెక్టర్ రావాలని భీష్మించారు. దీంతో వ్యవసాయాధికారి మితున్‌చక్రవర్తి రైతులతో మాట్లాడి గురువారం ఉదయం ప్రతీ ఒక్కరికి గన్నీబ్యాగులు అంది స్తామని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు భగవంతు, రాఘవేంద్రప్ప, లక్ష్మణ్ణ, రాములు, వెంకటేష్, నర్సిములు, అంజప్ప, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.