నల్ల జెండాలతో రైతుల నిరసన

ABN , First Publish Date - 2021-03-07T04:24:33+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ శనివారం ఆత్మకూరు మునిసిపాలిటీలోని గాంధీ చౌరస్తాలో వామపక్ష పార్టీ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో రైతులు నిరసన తెలిపారు.

నల్ల జెండాలతో రైతుల నిరసన
ఆత్మకూరులో నల్లజెండాలతో నిరసన తెలుపుతున్న నాయకులు

అమరచింత, మార్చి 6: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ శనివారం ఆత్మకూరు మునిసిపాలిటీలోని గాంధీ చౌరస్తాలో వామపక్ష పార్టీ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో రైతులు నిరసన తెలిపారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సం దర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోష మాట్లాడుతూ ఢిల్లీలో రైతు వ్యతిరే క చట్టాలను రద్దు చేయాలని 100 రోజులే పోరాటం చేస్తున్న కేద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని విమర్శించారు. రైతు పోరాటానికి మద్దతుగా వామపక్షాల ఆ ధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి శ్రీహరి, ఇఫ్ట్యూ జిల్లా కార్యదర్శి ప్రసాద్‌, రాబర్టు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:24:33+05:30 IST