కస్తూర్బా నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2021-02-06T04:37:58+05:30 IST

మరికల్‌ మండల శివారులో 449 సర్వేనెంబర్‌ ప్రభుత్వం 5 ఎకరాల స్థలంలో చేపడుతున్న కస్తూర్బా పాఠశాల నిర్మాణ పనులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు.

కస్తూర్బా నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు

మరికల్‌, ఫిబ్రవరి 5 : మరికల్‌ మండల శివారులో 449 సర్వేనెంబర్‌ ప్రభుత్వం 5 ఎకరాల స్థలంలో చేపడుతున్న కస్తూర్బా పాఠశాల నిర్మాణ పనులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు. సంఘటన స్థలానికి అధికారులు జిల్లా విద్యాశాఖధికారి రవీందర్‌, తహసీల్దార్‌ నాగలక్ష్మి, సీఐ శివకుమార్‌ చేరుకున్నారు. ఇందిరాగాంధీ హయాంలో 449 సర్వేనెంబర్‌లో 70 మంది నిరుపేదలకు భూ పంపిణీ చేశారని రైతు లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవడం సరికాదన్నా రు. భూ సమ్యసను ఎమ్మె ల్యే, కలెక్టర్‌ పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. రాత్రికి అవసరం అనుకుంటే ఇక్కడే బస చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు, సంఘాల నాయకులు గోపాల్‌, కుర్మన్న, మరికల్‌ మండల సర్కిల్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2021-02-06T04:37:58+05:30 IST