ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

ABN , First Publish Date - 2021-06-04T05:01:48+05:30 IST

ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు గురువారం మదూర్‌లో ధర్నా నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
మద్దూర్‌లో ఽధర్నా చేస్తున్న రైతులను సముదాయిస్తున్న ఎస్‌ఐ

మద్దూర్‌, జూన్‌ 3 : ధాన్యం కొనుగోలు చేయాలని  కోరుతూ రైతులు గురువారం మదూర్‌లో ధర్నా నిర్వహించారు. భవాణి రైస్‌ మిల్లులో 15వేల బస్తాలు నిల్వ చేశారు. మరింత నిల్వ ఉంచడానికి స్థలం సరిపో కపోవడంతో కొనుగులు నిలిపివేశారు. ధాన్యం విక్రయించడానికి రెండు రోజులుగా వరుసలో ఉండి నిరీక్షించిన రైతులు తీరా స్థలం సరిపోవడం లేదనే సాకుతో అధికారులు కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఆగ్ర హించి ఽధర్నా నిర్వహించారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని కోరా రు. రోడ్డుపై బైఠాయించిన రైతులను స్థానిక ఎస్‌ఐ సముదాయించారు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.



గన్నీ బ్యాగుల కోసం ఎదురుచూపులు


మాగనూర్‌ : మాగనూర్‌ మండలంలోని రైతులు ధాన్యాన్ని విక్రయించడానికి గన్నీ బ్యాగుల సమస్య తలెత్తింది. ఎన్నోరోజులుగా నిరీక్షించిన రైతులు గురువారం సింగిల్‌విండో కార్యాలయవ వద్దకు వచ్చి గన్నీ బ్యాగుల కోసం అఽధికారులను నిలదీశార. తుఫాను ప్రభావం వల్ల వర్షాలు వచ్చి ధాన్యం ఎక్కడతడిసిపోతుందోనని రైతులు దిగులుతో ఉన్నారు. వారం రోజుల కిందట కురిసిన వర్షానికే ధాన్యం తడిసి మొలకెత్తిందని రైతులు పేర్కొన్నారు. గన్నీ బ్యాగులు ఇవ్వకపోతే వర్షానికి మరోసారి ధాన్యం తడిసే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కోసం సింగిల్‌విండో అధికారులను సంప్రదిస్తే, మీకు క్రమసంఖ్య ప్రకారం బ్యాగులు అందిస్తామని చెబుతున్నారు కానీ అధికార పార్టీ నాయకులకు వారికి క్రమ సంఖ్య అవసరం లేకుండానే గన్నీ బ్యాగులను సరఫరా చేస్తూ రైతులను చిన్నచూపు చూస్తున్నారని పలువురు రైతులు విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని గన్నీ బ్యాగుల, లారీల కొరత తీర్చాలని వారు కోరుతున్నారు. 



Updated Date - 2021-06-04T05:01:48+05:30 IST