రైతు సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2021-12-29T05:01:39+05:30 IST

రైతుల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని, రైతులు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్టిష్టం అవుతోందని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయం
రైతు వేదిక ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి

రైతుల అభివృద్ధితోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం

రైతు వేదిక ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి

నారాయణపేట రూరల్‌, డిసెంబరు 28 : రైతుల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని, రైతులు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్టిష్టం అవుతోందని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని సింగారం, కోటకొండ, చిన్నజట్రం, కొల్లంపల్లి గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించి అనంతరం ఆయా కార్యక్రమాల్లో మాట్లాడారు. రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.5వేలు పెట్టుబడి సాయం అందిస్తోందన్నారు. ఎక్కడా లేని విధంగా రైతులు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల భీమాతో వెన్నంటి ఉందన్నారు. ప్రతీ ఐదువేల ఎకరాలు ఉన్న క్లస్టర్‌కు రైతు వేదికలను నిర్మించి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతోంద న్నారు. కేంద్రం కొనుగోలు చేయమని చెబితే రాష్ట్రంలో బీజేపీ నాయకులు రైతులను యాసంగిలో వరి పండించాలని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. యాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండనందున రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలన్నారు. కోటకొండలో చేనేత కార్మికుల అభివృద్ధికి చేనేత ట్రేనింగ్‌ సెంటర్‌ను రూ.2.50 కోట్లతో మంజూరు చేయించడం జరిగిందన్నారు. కోటకొండలో అభివృద్ధి కార్యక్రమాల కోసం సీడీపీ నిధుల నుంచి రూ.9 లక్షలు వెచ్చించ్చినట్లు తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన యువకులకు ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు మండలంలోని జాజాపూర్‌ రైతు వేదికలో రైతులకు ఆధునాతన వ్యవసాయంపై అవగాహన పెంచడానికి దేశీ కోర్సును ప్రారం భించారు. ఫర్టిలైజర్స్‌ డీలర్లకు ఒక సంవత్సరం పాటు ఈ కోర్సులో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అదే విధంగా మండలంలోని కోటకొండ పీహెచ్‌సీలో జడ్పీ నిధులు రూ.14.15 లక్షలతో ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కొల్లంపల్లిలో సీడీపీ నిధుల రూ.10 లక్షలతో బీసీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాప చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు కొంకల్‌ జయంతి, విజయలక్ష్మీ, రాములు, సాయిరెడ్డి, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ పి.అంజలి, విండో అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కోఆప్షన్‌ తాజుద్దీన్‌, ఎంపీటీసీలు అనసూయ, సునిత, వైస్‌ ఎంపీపీ పి.సుగుణ, రైతు సమితి మండలాధ్యక్షుడు వెంకట్రాములుగౌడ్‌, జిల్లా సభ్యుడు కోట్ల జగన్మోహన్‌రెడ్డి, వేపూరి రాములు, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కన్నజగదీశ్‌, నాయకులు భగవంతు, రవీగౌడ్‌, వివిధ గ్రామాల సర్పంచులు రాంమోహన్‌, త్రివిక్రమరావు, వ్యవసాయాధికారులు జాన్‌సుధాకర్‌, నాగరాజు  పాల్గొన్నారు.


Updated Date - 2021-12-29T05:01:39+05:30 IST