రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-13T04:39:08+05:30 IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తాటికొండలో రైతు వేదిక భనాన్ని ప్రారభిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే ఆల

-తాటికొండలో రైతు వేదిక ప్రారంభం

- అధికారులతో కలిసి విత్తన బంతులు చల్లిన ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి


భూత్పూర్‌, జూలై 12 : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తాటికొండ గ్రామంలో రైతు వేదిక భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల కష్టాలను స్వయంగా చూశారని, అందుకే దేశంలో ఏ ప్రభుత్వమూ అందించని సంక్షేమ పథకాలను ఇక్కడ అందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు పెట్టుబడి సహాయం, రైతుబీమా వంటి  పథకాలను  అందిస్తున్నారని అన్నారు. అనంతరం గ్రామానికి చెందిన 9మంది లబ్ధిదారులకు రూ.2,91,000 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందించారు. గ్రామ శివారులో వీరభద్రస్వామి గుట్ట మీద ఎంపీ, ఎమ్మెల్యే విత్తన బంతులను చల్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సాయికుమార్‌, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మండల రైతుబందు అధ్యక్షుడు నర్సిహుములుగౌడ్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, భూత్పూర్‌ మునిసిపల్‌ వార్డు కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి,  తహసీల్దార్‌ చెన్నకిష్టన్న, ఎంపీటీసీలు సాయిలు, వెంకటేశ్వరమ్మ, ఏడీఏ యశ్వంత్‌రావు, ఏవో మురళిధర్‌, ఏఈవో ప్రదీప్‌, పంచాయితీ కార్యదర్శి బాలరాజు, ఉప సర్పంచ్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T04:39:08+05:30 IST