పాల ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయం

ABN , First Publish Date - 2021-02-06T04:19:57+05:30 IST

పాలఉత్పత్తుల ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని పశు సంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ శివా నంద స్వామి అన్నారు.

పాల ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయం
పనీర్‌ తయారీపై శిక్షణ ఇస్తున్న ఏడీ శివానంద స్వామి

- పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ శివానంద స్వామి

- పనీర్‌ తయారీపై రైతులకు అవగాహన  

భూత్పూర్‌, ఫిబ్రవరి 5: పాలఉత్పత్తుల ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని పశు సంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ శివా నంద స్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని శేరిపల్లి(హెచ్‌) గ్రామంలో పాడి రైతులకు పనీర్‌ తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ పాలతో పనీర్‌ తయారు చాలా సులభమైన ప్రక్రియ అని అన్నారు. పనీర్‌ తయారు చేసి విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చన్నారు. అంతకుముందు గ్రామశివారులో రైతు రఘునందన్‌రెడ్డి వ్యవసాయ పొలంలో తక్కువ సమయంలో పశుగ్రాసం పెంపకం గురించి క్షేత్రస్థాయిలో పాడి రైతులకు వివరించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్‌ మధుసూదన్‌,  సర్పంచ్‌ శేఖర్‌, పశువైద్య సిబ్బం ది హరికుమార్‌, శ్రీనివాసులు, పాడిపోషకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:19:57+05:30 IST