ప్రత్యక్ష బోధనకు సర్వం సిద్ధం చేయాలి
ABN , First Publish Date - 2021-08-26T04:07:10+05:30 IST
ప్రత్యక్ష బోధనా తరగతులు ప్రారం భించడానికి అన్ని గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు ఈ నెల చివరి నాటికి సర్వం సిద్ధం చేసి ఉంచాలని కలెక్టర్ మనూచౌదరి అన్నారు.

- కలెక్టర్ మనూచౌదరి
నాగర్‌కర్నూల్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష బోధనా తరగతులు ప్రారం భించడానికి అన్ని గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు ఈ నెల చివరి నాటికి సర్వం సిద్ధం చేసి ఉంచాలని కలెక్టర్ మనూచౌదరి అన్నారు. బుధవారం ఉ దయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాలల పునఃప్రారంభం సన్నదతపై సంక్షేమ శాఖల అధికారులు, జిల్లా సమన్వయకర్తలు, పాఠశాలల ప్రిన్సిపాల్స్, జూ నియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్న అన్ని తరగతుల ప్రత్యక్ష బోధనా తరగతులకు జిల్లాలోని అన్ని సంక్షేమ, గురుకుల పాఠ శాలలను సిద్దంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ మనూచౌదరి అందరు అధికారులను ఆదేశించారు. అన్ని పాఠశాలల పరిసరాలు, తరగతి గదులు, వంట గదులు, మం చి నీటి ట్యాంకులు పరిశుభ్రం చేయించాలన్నారు. గ్రామ పరిధిలో అయితే పంచా యతీ సిబ్బంది, మునిసిపాలిటీలో మునిసిపల్ సిబ్బంది శుభ్రం చేయాల్సి ఉంటుం దన్నారు. సర్పంచ్‌లు, మునిసిపల్ కమిషనర్లతో మాట్లాడి పనులు చేయించుకోవా లన్నారు. ఎక్కడైనా చేయకుంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి పాఠశాల తరగతి గదులు, పరిసరాల్లో సోడియం హైపోక్లోరైడ్ లేదా బ్లీచింగ్ చల్లించాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికి సర్వం సిద్ధం చేసి పిల్లలు వచ్చేటప్పుడు మాస్కులు లేని వారికి మాస్కులు అందించి తప్పనిస రిగా ధరించే విధంగా చూడాలన్నారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచడం, సా ధ్యమైనంత వరకు పిల్లలను దూరం పాటించే విధంగా చూడాలన్నారు. ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలు కన్పిస్తే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీ సుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలన్నారు. లక్షణాలున్న వ్యక్తి ఎవరెవరితో కలిసి ఉ న్నడో తెలుసుకొని వారందరికీ కరోనా పరీక్షలు చేయించాలని తెలియజేశారు. ప్రతి రోజు ప్రిన్సిపాల్ తమ జిల్లా అధికారికి కొవిడ్ నివేదిక అందజేయాలని తద్వారా అ ధికారులు తనకు రోజువారి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పాఠశాలల్లో ఎక్క డా కొవిడ్ రాకుండా కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించా రు. జిల్లా వెనకబడిన సంక్షేమ అధికారి అనిల్‌ప్రకాశ్, సాంఘిక సంక్షేమ జిల్లా అ ధికారి రాంలాల్, జిల్లా సమన్వయకర్తలు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.