సర్వజనులు సుఖ సంతోషాలతో ఉండాలి
ABN , First Publish Date - 2021-12-27T03:38:16+05:30 IST
అయ్యప్ప స్వామి దీవెనలతో సర్వజనులు సుఖసంతో షాలతో ఉండాలని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్ర శేఖర్‌రెడ్డి అన్నారు.

- టీడీపీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి
- ఘనంగా అయ్యప్పస్వామి మండల పూజ, అష్టాభిషేకం
- స్వంత నిధులతో నిర్మించిన ఆలయ ముఖద్వారం ప్రారంభం
వనపర్తి టౌన్, డిసెంబరు 26 : అయ్యప్ప స్వామి దీవెనలతో సర్వజనులు సుఖసంతో షాలతో ఉండాలని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్ర శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో మండల పూజ, పడిపూజ, అష్టాభిషేకాలు ఘనంగా నిర్వహిం చారు. మండలపూజకు హాజరైన రావుల తన తల్లి వెంకటపద్మమ్మ పేరుమీద స్వంత నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం అయ్యప్పస్వామి పూ జలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావుల మా ట్లాడుతూ ఎక్కడైతే భక్తిభావం ప్రజ్వరిల్లుతుందో అక్కడ సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయన్నారు. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధ లతో మాలాధరణ చేసి, దేశ సుభిక్షానికి పూజలు చేయడం సంతోషదాయకమన్నారు. ఆలయ ప్ర ధాన అర్చకుడు రమేష్‌శర్మ సిద్దాంతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గురుస్వా ములు ముత్తుకృష్ణ, నరేందర్, నందిమల్ల అశోక్, వెం కన్న, వాకిటి శ్రీధర్, లక్ష్మినారాయణ, గోపి, బీచుపల్లియాదవ్, భాస్కర్‌రెడ్డి, వినోద్, ఆలయ కమిటీ సభ్యులు మారం బాలీశ్వరయ్య, నగేష్, రమణ, పాల్గొనగా గురుస్వాములను రావుల ఘనంగా సన్మానించారు. రావుల వెంట అచ్చుత రామారావు, మాజీ జడ్పీటీసీ వెంకటయ్యయాదవ్, నందిమల్ల శారద, మునిసిపల్ కౌన్సిలర్ లక్ష్మి, జమీల్, దస్తగిరి, రవియాదవ్, నందిమల్ల రమేష్, ఎండీ.గౌస్, కొత్తగొల్ల శంకర్, వెంకటేష్‌యాదవ్, వాకిటి నారాయణ తదితరులున్నారు.