బాలల సహాయ వాణి కేంద్రం ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-18T04:41:17+05:30 IST

కొవిడ్‌ బారిన పడిన తల్లిదండ్రుల పిల్లలకు బాలల సంరక్షణ కేంద్రంలో వసతి, రక్షణ, సంరక్షణ కల్పించడానికి బాలల సహాయవాణి కేంద్రం ఏర్పాటు చేసినట్లు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ తెలిపారు.

బాలల సహాయ వాణి కేంద్రం ఏర్పాటు
పోస్టర్‌ను విడుదల చేస్తున్న అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

మహబూబ్‌నగర్‌, కలెక్టరేట్‌ మే 17: కొవిడ్‌ బారిన పడిన తల్లిదండ్రుల పిల్లలకు బాలల సంరక్షణ కేంద్రంలో వసతి, రక్షణ, సంరక్షణ కల్పించడానికి బాలల సహాయవాణి కేంద్రం ఏర్పాటు చేసినట్లు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమ వారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన ఓ సమావే శంలో బాలల సహాయవాణికి సంబంధించి పోస్టర్‌ను డీఆర్‌వో కె. స్వర్ణలతతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ జిల్లాలో తల్లిదండ్రులు కొవిడ్‌ బారినపడి, పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి ఎవ్వరూ లేకుంటే బాలసదనం నందు బాలురను జీవైపీఎస్‌వై చిల్డ్రన్‌ హోం, భూత్పూర్‌లో ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపారు. బాలల సహాయవాణి కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు 040-23733665 నెంబర్‌కు, 1098 చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌లు అందుబాటులో ఉం టాయని వివరించారు. 


మరో ఐదు రోజులు దృష్టి పెట్టండి

ఫీవర్‌ సర్వేలో గుర్తించిన కరోనా లక్షణాలు ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులపై పరిశీలించేందుకు  మరో ఐదు రోజులపాటు దృష్టి పెట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ వైద్యాధి కారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి కొవిడ్‌, ధాన్యం కొనుగోలుపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొనుగోలు కేం ద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన తర లించే విషయమై దృష్టి సారించాలని ఆయన చెప్పా రు. ఇందుకోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనాపై ఆయన మాట్లాడుతూ ప్రతి ఆరోగ్య కేంద్రం ముందు టెంట్‌తో సహా తాగు నీటిని ఏర్పాటు చేయాలని అన్నారు. కరోనా విపత్తు సమ యంలో జిల్లా, మండల స్థాయి అధికారులు అందరూ ప్రజల కోసం ఇంకా ఎక్కువ సమయం పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫీవర్‌ సర్వే సందర్భంగా కరోనా లక్షణాలను గుర్తించిన వారిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచాలని, అవకాశం లేకుంటే కొవిడ్‌ సెంటర్లకు పంపించాలని సూచించారు. ప్ర భుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువులు, సహాయకు లకు కూడా కరోనా కిట్లు ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా సహాయకులకు భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రా లపై తహసీల్దార్లు దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా వైద్యా ఆరోగ్యశాఖాధి కారి డాక్టర్‌ క్రిష్ణ, మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంమ్‌కిషన్‌, తహసీల్దార్లు, మునిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.




Updated Date - 2021-05-18T04:41:17+05:30 IST