గౌరారం ఉర్సులో ఎమ్మెల్సీ గోరటి

ABN , First Publish Date - 2021-02-09T04:07:48+05:30 IST

తెలకపల్లి మండలం గౌరారంలోని దర్గా ఉర్సులో సోమవారం ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జడ్పీచైర్‌పర్సన్‌ పద్మావతి పాల్గొన్నారు.

గౌరారం ఉర్సులో ఎమ్మెల్సీ గోరటి
దర్గా వద్ద మొక్కులు తీర్చుకుంటున్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

తెలకపల్లి, ఫిబ్రవరి 8: తెలకపల్లి మండలం గౌరారంలోని దర్గా ఉర్సులో సోమవారం ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జడ్పీచైర్‌పర్సన్‌ పద్మావతి పాల్గొన్నారు. దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఎంపీపీ మధు, సర్పంచ్‌ జంబులు, మాజీ ఎంపీటీసీ బంగారయ్య, కువళేశ్వర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-09T04:07:48+05:30 IST