లావణ్యది ప్రభుత్వ హత్యే : కేవీపీఎస్‌

ABN , First Publish Date - 2021-07-25T04:11:18+05:30 IST

బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి లావణ్యది ప్రభుత్వ హత్యనే అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్షు డు జాన్‌ వెస్లీ అన్నారు.

లావణ్యది ప్రభుత్వ హత్యే : కేవీపీఎస్‌

వనపర్తి టౌన్‌, జూలై 24: బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి లావణ్యది   ప్రభుత్వ హత్యనే అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్షు డు జాన్‌ వెస్లీ అన్నారు.  జిల్లా కేంద్రంలోని  లావణ్య కుటుం బాన్ని కేవీపీఎస్‌ నాయకులు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు కొనలేక నే చనిపో తున్నా అని విద్యార్థి చెప్పిన మాటలు సమాజాన్ని కలచివేశా యన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యపు విధానమే ఆమె ఆత్మహత్యకు కారణమన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు  భగత్‌, నాయకులు ఆంజనేయులు, ఎస్సీ, ఎస్టీ మా నిటరింగ్‌ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు, సాయిలీల, మెగిలి అజయ్‌, మన్నెం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T04:11:18+05:30 IST