విద్యుత్‌ బిల్లుల బకాయి చెల్లించలేం

ABN , First Publish Date - 2021-03-25T04:16:32+05:30 IST

విద్యుత్‌ బిల్లుల పాత బకాయి చెల్లించలేమని నాగవరం తండా వాసులు స్పష్టం చేశారు.

విద్యుత్‌ బిల్లుల బకాయి చెల్లించలేం
విద్యుత్‌ అధికారులతో వాగ్వాదానికి దిగిన తండావాసులు

 - సంబంధితశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగిన నాగవరం తండావాసులు 

వనపర్తి రూరల్‌, మార్చి 24: విద్యుత్‌ బిల్లుల పాత బకాయి చెల్లించలేమని నాగవరం తండా వాసులు స్పష్టం చేశారు.  విద్యుత్‌ బిల్లులు పెండిం గ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించకుంటే సరఫరా ను పూర్తిగా నిలిపివేస్తామని బుధవారం తండాలో సంబంధిత శాఖ అధికారులు పర్యటించారు. తండా లో మొత్తం 70కి పైగా ఇళ్లు ఉండగా ఏ ఒక్కరు కూడా విద్యుత్‌, బోరు మోటారు బిల్లులు చెల్లిం చడం లేదన్నారు.  2006నుంచి బిల్లులు కట్టడం లే దని ఒక్కొక్కరి పేరు మీదు రూ. 15వేలకుపైగా బిల్లులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇలా మొత్తం దాదాపు రూ. 10లక్షలకుపైగా బిల్లులు పెం డింగ్‌లో ఉన్నాయని, చెల్లించకుంటే విద్యుత్‌ సరఫ రాను పూర్తిగా నిలిపివేస్తామని అధికారులు హె చ్చరించారు. దాంతో తండావాసులకు సిబ్బందికి వాగ్వాదం చోటు చేసుకుంది.  తండాలకు విద్యుత్‌ ఉచితమని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చిందని, మేము బకాయి బిల్లులు మాత్రం చెల్లించలేమని స్పష్టం చేశారు. అప్పటి నుంచి బిల్లులు అడగకుం డా ఇప్పుడు వచ్చి కట్టాలంటే మేము ఎలా కడతా మని పలువురు వాదనకు దిగారు. బోరు మోటార్ల కనెక్షన్లు తొలగించవద్దని కోరారు.  లేదంటే మా తండాకు విద్యుత్‌ అవసరం లేదని, మీ ట్రాన్స్‌ఫా ర్మర్లు తీసుకువెళ్లాలని తెలిపారు.

Updated Date - 2021-03-25T04:16:32+05:30 IST