శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
ABN , First Publish Date - 2021-12-27T04:17:06+05:30 IST
నారాయణపేట జిల్లాలో శాంతిభద్రతల పరి రక్షణకు ప్రత్యేక కృషి చేస్తానని ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

నారాయణపేట ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎన్.వెంకటేశ్వర్లు
బార్డర్ చెక్‌పోస్టులపై నిఘా పెంచుతాం : ఎస్పీ
నారాయణపేట క్రైం, డిసెంబరు 26 : నారాయణపేట జిల్లాలో శాంతిభద్రతల పరి రక్షణకు ప్రత్యేక కృషి చేస్తానని ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఏఆర్ పోలీ సుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడు తూ ఏడాదిన్నర పాటు ఉమ్మడి జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేసినట్లు పేర్కొన్నారు. 9 నెలల క్రితమే ఎస్పీగా పదోన్నతి లభించిందని, మొదటి సారిగా నారాయణపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు న్యాయబద్దంగా సేవలందిస్తానన్నారు. జిల్లాలో క్రైం రేటును తగ్గించేందుకు, రోడ్డు ప్రమాదాల నివార ణ, అక్రమ వ్యాపారాల అడ్డుకట్టపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. నారాయణ పేట జిల్లాకు కర్ణాటక సరిహద్దు అతి దగ్గరలోనే ఉన్నందున బార్డర్ చెక్ పోస్టులపై మరింత నిఘా పెంచుతామన్నారు. ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే చొరవతో నారాయణపేట రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఆయా విభాగాల పరిశీలన..
నూతన జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ఎన్.వెంకటే శ్వర్లు జిల్లా పోలీసు కార్యాలయంలోని డీసీఆర్‌బీ, కమ్యూని కేషన్, ఎస్‌బీ, ఐటీకోర్, కమాండ్ కంట్రోల్, డీపీవో, పరేడ్ గ్రౌండ్ మైదానాన్ని అడిషనల్ ఎస్పీ భరత్‌తో కలిసి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లాకు చెందిన పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు అందించారు.
శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ అధికారులు..
ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లును జిల్లాలోని మక్త ల్, మరికల్, కోస్గి, నారాయణపేట సర్కిల్‌కు చెందిన పోలీస్ అధికారులు మర్యాదపూర్వ కంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభా కాంక్షలు తెలిపారు. సీఐలు రాంలాల్, ఇప్తె కార్ అహ్మద్, శివకుమార్, జనార్దన్, శంకర్, ఎస్‌ఐలు నాగరాజు, సురేష్‌గౌడ్, గోవర్దన్, నరేందర్, అరుణ్‌కుమార్, అశోక్‌బాబు, రా జేందర్, విజయ్‌భాస్కర్, రాములు, శివ నాగేశ్వర్ నాయుడు, రామపర్వతాలు ఆయా విభాగాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.