పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-08-28T04:34:53+05:30 IST

నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీసు అధికారులు సమర్థవంతంగా పని చేయాలని ఎస్పీ అపూర్వారావు చెప్పారు.

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ అపూర్వారావు

 వనపర్తి క్రైం, ఆగస్టు 27 : నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీసు అధికారులు సమర్థవంతంగా పని చేయాలని ఎస్పీ అపూర్వారావు చెప్పారు. జిల్లా కార్యాలయంలో శుక్ర వారం ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీసులు న్యాయాధి కారులతో సమన్వయం చేసుకొని బాధ్యతగా వ్యవ హరించాలని సూచించారు.  జిల్లాలోని ఆయా పోలీస్‌ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించారు. శాస్త్ర, సాంకేతిక ఆధారాల తో పకడ్బందీగా  దర్యాప్తు చేస్తేనే నిందితులు చట్టం నుంచి తప్పించుకోకుండా కఠిన శిక్షలు పడతాయని తెలిపారు. అలాంటప్పుడు నేరం చేస్తే శిక్ష పడుతుం దనే భయం నేరస్తులకు ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి, గుట్కా, మట్కా లాంటి నిషేధిత వస్తువుల రవాణాకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. జిల్లా ప్రజలు సైబర్‌ క్రైమ్స్‌ బారినపడకుండా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల ని సూచించారు. సమావేశ అనంతరం పోలీసు శాఖలో సమర్దవంతమైన సేవలందించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్‌, డీఎస్పీ కిరణ్‌కుమార్‌, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్‌, కొత్తకోట సీఐ మల్లికార్జున్‌రెడ్డి, ఆత్మకూర్‌ సీఐ సీత య్య, పట్టణ ఎస్‌ఐ మధుసూదన్‌, వనపర్తి రూరల్‌ ఎస్‌ఐ షేక్‌ షఫీ, జిల్లాలోని ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-08-28T04:34:53+05:30 IST