పీజీ కళాశాల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-06-23T04:30:45+05:30 IST

మౌలిక వసతులను కల్పించి గద్వాల పీజీ కళాశాలను అభివృద్ధి చేస్తామని పాలమూరు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ అన్నారు.

పీజీ కళాశాల అభివృద్ధికి కృషి
మీడియాతో మాట్లాడుతున్న వైస్‌ చాన్స్‌లర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

- ఈ ఏడాది ఎంబీఏ, వచ్చే ఏడాది సైన్స్‌ కోర్సులు ప్రారంభం

- పాలమూరు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌

గద్వాల రూరల్‌, జూన్‌ 22 : మౌలిక వసతులను కల్పించి గద్వాల పీజీ కళాశాలను అభివృద్ధి చేస్తామని పాలమూరు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ అన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన పీజీ కళాశాల భవనంతో పాటు కొత్తగా నిర్మించిన హాస్టల్‌ భవనాలను, తరగతి గదులను, ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఎంబీఏ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఎమ్మెస్సీ ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, బాటనీ, జువాలజీ కోర్సుల ప్రారంభానికి కృషి చేస్తానని తెలిపారు. కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మించిన హాస్టల్‌ భవనాలను వచ్చే నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. కోర్సులకు తగినట్లు అధ్యాపకులను కూడా నియమిస్తామని చెప్పారు. కళాశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే పలు విషయాలను వీసీ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట రిజిస్ర్టార్‌ పవన్‌ కుమార్‌, ప్రొఫెసర్‌ మనోజ, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, ఎంపీపీ ప్రతాప్‌ గౌడ్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఎంఏ సుభాన్‌ ఉన్నారు. 

Updated Date - 2021-06-23T04:30:45+05:30 IST