మత్స్యకారుల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-10-29T05:40:36+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

మత్స్యకారుల అభివృద్ధికి కృషి
చేప పిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

జూరాల బ్యాక్‌ వాటర్‌లో చేప పిల్లలు విడుదల

మక్తల్‌ రూరల్‌, అక్టోబరు 28 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గడ్డంపల్లి గ్రామం జూరాల బ్యాక్‌ వాటర్‌లో గరువారం 12.69 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ఉచితంగా రొయ్యలు, చేప పిల్లలు పంపిణీ చేస్తోందని దీన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ నాగులు, మాజీ ఎంపీపీ హనుమంతు, సర్పంచ్‌ త్రివేణి, జ్ఞానేశ్వర్‌, మత్స్య కార్మికులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-29T05:40:36+05:30 IST