ఎకో పార్క్‌ గొప్పగా ఉంది

ABN , First Publish Date - 2021-07-13T04:50:47+05:30 IST

పాలమూరులో అర్బన్‌ ఎకో పార్క్‌ తాను ఊహించిన దానికన్నా ఎంతో గొప్పగా ఉందని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ అన్నారు.

ఎకో పార్క్‌ గొప్పగా ఉంది
డ్రోన్‌ ద్వారా చల్లుతున్న విత్తన బంతులు

పాలమూరులో అద్భుత ప్రగతి 

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌

అందరి సహకారంతో అద్భుత పార్క్‌గా తీర్చిదిద్దాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సీడ్‌ బంతులను వెదజల్లిన డ్రోన్‌ కెమెరాలు

రహదారికి ఇరువైపులా లక్ష మొక్కలు నాటే కార్యక్రమం


 మహబూబ్‌నగర్‌, జూలై 12: పాలమూరులో అర్బన్‌ ఎకో పార్క్‌ తాను ఊహించిన దానికన్నా ఎంతో గొప్పగా ఉందని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ అన్నారు. ఎకోపార్క్‌ అభివృద్ధికి తనవంతు సహకారం తప్పకుండా ఉంటుందని, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అడిగినట్లు 2,087 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్‌లో 20 ఎకరాలా? 100 ఎకరాలా? తన చేతనైనంతా స్థలాన్ని దత్తత తీసుకుం టానని చెప్పారు. తన ఎంపీ నిధులు, లేదంటే స్నేహితుల సహకారంతో ఇక్కడ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మహిళా సంఘాలతో తయారు చేయిం చిన సీడ్‌ బంతులను ఎకో పార్క్‌లో చల్లే కార్యక్రమాన్ని ఎంపీ సంతో ష్‌కుమార్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సోమవారం ప్రారంభించారు. 3 డ్రోన్‌ కెమెరాల్లో సీడ్‌ బంతులను నింపి వాటిని అడవిలో వదిలారు. మహిళా సంఘాలు తయారు చేసిన 2 కోట్ల విత్తన బంతులను వారం పాటు జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రదేశాల్లో వెదజల్లనున్నారు. ఈ సందర్భంగా సంతోష్‌ కుమార్‌ మాట్లాడు తూ పార్క్‌ అభివృద్ధిలో తననూ భాగస్వామ్యం చేయడాన్ని తప్ప కుండా స్వీకరిస్తానని చెప్పారు. తాను పదేళ్ల కిందట పాలమూరుకు వచ్చానని, అప్పటి పాలమూరుకు ఇప్పుడున్న పాల మూరుకు ఎంతో మార్పు ఉందని చె ప్పారు. శ్రీనన్న ఎమ్మెల్యే అయిన తరువాత ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. పాలమూరు ప్రజలు మిమ్మల్ని చిరస్థాయిగా గుర్తుంచుకునేలా పని చేస్తున్నారని, మీ కృషికి ధన్యవాదాలని మంత్రిని ప్రశంసించారు. మహిళా సంఘాల సభ్యులు కేవలం పది రోజుల్లోనే 2.08 కోట్ల విత్తన బంతులు తయారు చేయడం గొప్ప విషయన్నారు. మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


తక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రమించాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

 తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పాలమూరులో 500 గజాలలో మంచి పార్క్‌ కూడా లేదని, ప్రజలకు ఒక మంచి పార్క్‌ను ఏర్పాటు చేయాలని మయూరి నర్సరీని అంచెలంచెలుగా అభివృద్ధి చేశామని అన్నారు. దేశంలోనే ఇదివరకు 1,400 ఎకరాల్లో కలకత్తాలో పార్క్‌ ఉందని, ఇక్కడ 2,087 ఎకరాల్లో అతిపెద్ద పార్క్‌ను అందరి సహకారంతో అద్భుతంగా ఏర్పాటు చేశామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువగా శ్రమించి, దేశంలోని పార్క్‌లలో ఉన్న అద్భుతమైనవన్నీ ఇక్కడ ఉండేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాజ్యసభ్యుడు, హరిత ప్రేమికుడు సోదరుడు సంతోష్‌ పార్క్‌లో 100 ఎకరాల స్థలాన్ని దత్తత తీసుకుని, ఆయన పేరుపై అభివృద్ధి చేస్తే చిరస్థాయిగా నిలిచిపోతుందని కోరారు. దేశంలోనే మంచి పార్క్‌ ఎక్కడ ఉందంటే పాలమూరువైపు చూసేలా చేయడమే తమ లక్ష్యమన్నారు.


రహదారికి ఇరువైపులా లక్ష మొక్కలు

 జడ్చర్ల-మహబూబ్‌నగర్‌ జాతీయ రహదారికి ఇరువైపు లక్ష మొక్కలు నాటే కార్య క్రమంలో రాజ్యసభ సభ్యుడు సంతో ష్‌కుమార్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. మహిళా సంఘాల సభ్యులు, ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో మహిళలను ఈ కార్యక్రమం కోసం తరలించారు. మంత్రి, ఎంపీ రాగానే మహిళలు రహదారికి ఇరువైపుల మొక్కలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం కోసం మహిళలను ఉదయం 8 గంటల నుంచే గ్రామాల నుంచి వాహనాల్లో తరలించారు. చాలామంది అలిసిపోయి, రహదారికి ఇరువైపులా తమకు కేటాయించిన స్థానాల్లో అతిథులు వచ్చేవరకు కూర్చున్నారు. హడావుడిగా కార్యక్రమం చేయడంతో చాలామంది మొక్కలను నాటకుండా రోడ్డుపైనే వదిలేశారు. ఎకో పార్క్‌ నుంచి అప్పన్నపల్లి ఫ్లైఓవర్‌ వరకు వేల సంఖ్యలో వచ్చిన మహిళలు రోడ్డుకు ఇరువైపలా బారులుతీరారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌, ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు, అడిషనల్‌ కలెక్టర్‌లు తేజస్‌నందలాల్‌ పవార్‌, సీతారామారావు, డీఎఫ్‌వో గంగారెడ్డి, డీఆర్‌డీవో యాదయ్య, జడ్పీ సీఈవో జ్యోతి, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, కోరమోని వెంకటయ్య, చెరుకుపల్లి రాజేశ్వర్‌ పాల్గొన్నారు. 


పార్క్‌లు ప్రారంభం

 అర్బన్‌ ఎకో పార్క్‌లో జింకల పార్క్‌ను సంతోష్‌ కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. 40 జింకలను పార్క్‌లో వదిలారు. శ్రీనివాసకాలనీ పార్క్‌ను ప్రారంభించారు. సందర్శకులకు ఆహ్లాదకరంగా పార్క్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు.

పీయూలో..

పాలమూరు యూనివర్సిటీ: గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సబ్యుడు సంతోష్‌కుమార్‌ సోమవారం పాలమూరు యూనివర్సిటీలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నెశ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌రాథోడ్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పిండిపవన్‌ కుమార్‌, ఓఎస్‌డీ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. వర్శిటీ గురించి మంత్రి, వీసీతో చర్చించారు. వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్‌ని ఎంపీ సత్కరించారు. పలు సమస్యలపై విధ్యార్థి సంఘాల నాయకులు మంత్రి, ఎంపీలకు వినతులు ఇచ్చారు.Updated Date - 2021-07-13T04:50:47+05:30 IST