మందకొడిగా పన్ను వసూలు

ABN , First Publish Date - 2021-03-22T03:44:45+05:30 IST

పాలమూరు పురపాలికలో ఆస్తి పన్ను వసూలు మందకొడిగా సాగుతోంది. మార్చి 31 నాటికి పన్ను వంద శాతం వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా, ఇక్కడ మాత్రం మూడోవంతు మాత్రమే వసూలైంది.

మందకొడిగా పన్ను వసూలు
మునిసిపల్‌ కార్యాలయంలో పన్ను చెల్లిస్తున్న పట్టణ ప్రజలు

మిగిలింది పది రోజులే.. వసూలు కావాల్సింది రూ.5.2 కోట్లు

మహబబూబ్‌నగర్‌, మార్చి19: పాలమూరు పురపాలికలో ఆస్తి పన్ను వసూలు మందకొడిగా సాగుతోంది. మార్చి 31 నాటికి పన్ను వంద శాతం వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా, ఇక్కడ మాత్రం మూడోవంతు మాత్రమే వసూలైంది. సరైన ప్రణాళిక లేకపోవడం, మొండి బకాయిలపై ఉదాసీనత ప్రదర్శించడం వంటి కారణాలతో పన్నుల వసూలులో జాప్యానికి కారణమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి పన్ను చెల్లించిన వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నారు. దీనిపై పురపాలిక సిబ్బందిని ఇప్పటికే ఇంటింటికి తిప్పినా ఫలితం లేకుండా పోయింది. పన్ను చెల్లించాలని ఆటోలకు మైక్‌లు అమర్చి, ప్రచారం చేస్తున్నారు. 


75.9 శాతమే వసూలు

ఆస్తి పన్ను ఇప్పటి వరకు కేవలం 75.9 శాతం మాత్రమే వసూలు అయ్యింది. చివరి పది రోజుల్లో 10 శాతం వసూలు కావాల్సి ఉంది. పురపాలికలో 44,517 గృహాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.21.65 కోట్ల వరకు పన్నులు రావాల్సి ఉండగా, రూ.16.45 కోట్లు మాత్రమే వసూల అయ్యాయి. మరో రూ.5.20 కోట్లు వసూలు కావాల్సి ఉంది. పన్నులు సకాలంలో చెల్లించి, పురపాలిక అభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. గడువు సమీపిస్తున్నందున పన్ను చెల్లించి, రాయితీ సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు.

Updated Date - 2021-03-22T03:44:45+05:30 IST