మణయ్యచారిని అభినందించిన డీఎస్పీ
ABN , First Publish Date - 2022-01-01T04:41:23+05:30 IST
కలపపై శిల్పాలు చెక్కిన మణయ్యచారిని డీఎస్పీ కిరణ్‌కుమార్ శాలువ, పూలబొకేతో అభినందించారు.

వనపర్తి టౌన్, డిసెంబరు 31: కలపపై శిల్పాలు చెక్కిన మణయ్యచారిని డీఎస్పీ కిరణ్‌కుమార్ శాలువ, పూలబొకేతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణయ్యచారి ప్రతిభను గుర్తించిన ద యూనివర్శల్ తమిళ్ యూనివర్శిటీ డాక్టరేట్‌తో గౌరవించడం అభినందనీయమని డీఎస్పీ అన్నారు. కలపపై సూక్ష్మంగా తీర్చిదిద్దుతున్న తీగ పని నైపుణ్యంతో పాటు దేవతా ప్రతిమలను మలుచుతున్న వైనాన్ని అడిగి తెలుసుకున్నారు. మణయ్యచారికి డాక్టరేట్‌తో తగిన గౌరవం లభించిందని, భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని డీఎస్పీ అభినందించారు.
పెండింగ్ కేసులు పరిష్కరించాలి : డీఎస్పీ
కొత్తకోట, డిసెంబరు 31: శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు నిర్లక్ష్యం చేయద్దని డీఎస్పీ కిరణ్ కుమార్ అన్నారు. కొత్తకోట పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం డీఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరిచంఆలని ఆదేశించారు. వి ధులు సక్రమంగా నిర్వహిస్తున్న పోలీసులను అభినందించారు. అంతకు ముందు సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నాగశేఖర్‌రెడ్డి పుష్ప గుచ్ఛంతో డీఎస్పీకి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వం దనం చేశారు.