దాతల బియ్యం స్వాహా చేసిన క్లర్క్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-03-25T04:29:05+05:30 IST

మండలంలోని ఊర్కొండపేటలో అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్న దానం చేయడానికి దాతలు ఇచ్చిన ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని క్లర్క్‌ ఎ.ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి అమ్ము కున్న సంఘటన ‘ఆంధ్రజ్యోతి’లో మార్చి 22న కథనం రావడంతో స్పందించిన దేవదాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం అతడ్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామేశ్వరశర్మ తెలిపారు.

దాతల బియ్యం స్వాహా చేసిన క్లర్క్‌ సస్పెన్షన్‌

ఊర్కొండ, మార్చి 24: మండలంలోని ఊర్కొండపేటలో అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్నదానం చేయడానికి దాతలు ఇచ్చిన ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని క్లర్క్‌ ఎ.ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి అమ్ముకున్న సంఘటన ‘ఆంధ్రజ్యోతి’లో మార్చి 22న కథనం రావడంతో స్పందించిన దేవదాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం అతడ్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామేశ్వరశర్మ తెలిపారు.  గత పదిహేను సంవత్సరాల నుంచి ఆలయంలో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి పది రోజుల క్రితం బియ్యం అమ్ముకున్నట్లు  వరుస కథనాలు రావడంతో ఆతనికి షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.  బియ్యం అమ్ముకున్న ఘటనపై ఉన్నతాధికారుల విచారణ చేసి ఇది వాస్తవం అని తేలడంతో ఆరు క్వింటాళ్ల బియ్యం ధర రూ.26 వేలు అతని వద్ద నుంచి రికవరీ చేసి ఆలయం ఖాతాలో డిపాజిట్‌ చేసినట్లు తెలిపారు. బియ్యం అమ్ముకోవడం, ఆలయానికి వస్తున్న భక్తులకు ఇబ్బందులు పెట్టడం లాంటివి విచారణలో తేలినందున దేవాదాయ హైదరాబాద్‌ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ రామకృష్ణ ఆదేశాల మేరకు ఆలయ క్లర్క్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. 



Updated Date - 2021-03-25T04:29:05+05:30 IST