నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవొద్దు

ABN , First Publish Date - 2021-08-11T05:15:24+05:30 IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు.

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవొద్దు
మక్తల్‌ : అనుగొండలో షూ పాలిష్‌ చేస్తూ నిరసన తెలుపుతున్న నాయకులు

- బీజేవైఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన నారాయణపేట/ మక్తల్‌ రూరల్‌/ ధన్వాడ, ఆగస్టు 10 : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రమైన నారాయణ పేటలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపగా, మక్తల్‌ మండలం అనుగొండ గ్రా మంలో షూ పాలిష్‌ చేస్తూ, టీ పోస్తూ నిరసన వ్యక్తం చేశారు. ధన్వాడలో బీజేవై ఎం నాయకులు రోడ్డు ఊడ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయ కులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోం దని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకే అని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ తన కుటుంబానికి మంత్రి, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఉద్యోగాలు ఇచ్చుకొని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేటలో  బీజేవైఎం ప్రధానకార్యదర్శి వెంకటేష్‌, నాయకులు రఘు, మోహన్‌, రవితేజ, ప్రకాష్‌, చేతన్‌, రవి, బాలు, అజయ్‌, నిరంజన్‌, శ్రవణ్‌, మక్తల్‌లో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షు డు వన్నవాడ శ్రీకాంత్‌, నాయకులు ఆంజనేయులు, రాము, అంజి, శ్రీను, నాగరాజు, సురేష్‌, ధన్వాడలో  బీజేవైఎం జిల్లా కార్యదర్శి జుట్ల రాఘవేందర్‌ గౌడ్‌, కురుమూర్తి యాదవ్‌, చక్రి, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T05:15:24+05:30 IST