నిర్లక్ష్యం వహించొద్దు

ABN , First Publish Date - 2021-05-31T04:26:02+05:30 IST

పారిశుధ్య పనుల విష యంలో నిర్లక్ష్యం వహించొద్దని మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ హెచ్చరించారు.

నిర్లక్ష్యం వహించొద్దు
పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌

- మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌  

- పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలన

వనపర్తి టౌన్‌, మే 30: పారిశుధ్య పనుల విష యంలో నిర్లక్ష్యం వహించొద్దని మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ హెచ్చరించారు.  ఆదివారం తెల్లవా రు జామున పట్టణంలో పారిశుధ్య పనులను ఆయ న పరిశీలించారు.  సరైన సమయానికి కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో చైర్మన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరోనా సమయంలో అత్యవసరమైతే తప్ప  సె లవులు  ఇవ్వకూడదనే జీవో ఉన్నప్పటికీ పట్టణం లోని నాలుగు సెంటర్లలో కలిపి కనీసం 30మంది  కార్మికులు విధుల్లో లేరన్నారు. ఇలా అయితే   పారి శుధ్య పనులు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించా రు. కౌన్సిల్‌ను గౌరవించకుండా అధికారులు వ్య వహరిస్తున్నారని మండిపడ్డారు. వనపర్తి  మునిసి పల్‌ అధికారులు స్వంత నిర్ణయాలు తీ సుకుంటూ నియంతలా వ్యవహరించి నిర్లక్ష్యం వహించడం వ ల్ల పట్టణంలో పారిశుధ్యం పడకేస్తుందని చైర్మన్‌ ఆ గ్రహం వ్యక్తం చేశారు.  నెల రోజులుగా స్వీపింగ్‌ మిషన్‌ ఎక్కడుందో కూడా ము నిసిపల్‌ ప్రధాన అ ధికారి కౌన్సిల్‌కు చెప్పకపోవడం ఏంటని మండిప డ్డారు. హరితహారం కార్యక్రమంలో మొక్కల సంర క్షణకు ఎనిమిదిమంది కార్మికులను తీసుకున్నప్పటి కీ చందాపూర్‌, పాన్‌గల్‌రోడ్లలో ఒక్క మొక్క కూడా లేదన్నారు. ఆయా విషయాలను గుర్తించి వివరణ కోరినా నిర్లక్ష్యపు సమాధానం ఇస్తూ కౌన్సిల్‌ను అ వమానించడం సరైనవిధానం కాదని మండిపడ్డారు. 

Updated Date - 2021-05-31T04:26:02+05:30 IST