ధాన్యం సేకరణలో ఇబ్బందులు కలుగొద్దు

ABN , First Publish Date - 2021-11-27T04:57:05+05:30 IST

ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఆదేశించారు.

ధాన్యం సేకరణలో ఇబ్బందులు కలుగొద్దు

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), నవంబరు 26 : ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన ధాన్యంసేకరణ, కొనుగోలు కేంద్రాలపై తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహిం చిన  వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధం ఉన్న అధికా రులందరు ప్రతీ రోజు కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా అవసరమైన టార్పాలిన్‌, తేమను కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు ఇవ్వాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేయడంలో ఇబ్బందులు లేకుండా దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, డీఆర్డీవో, మార్కెటింగ్‌ తది తర శాఖల అధికారులు రోజుకు కనీసం 10 కేంద్రాలకు తగ్గకుండా తనిఖీలు నిర్వహించా లని సూచించారు. ఈ కాన్ఫరెన్సులో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, వ్యవ సాయ అధికారిణి సుచరిత, డీఆర్డీఓ యాదయ్య, ఏపీఎంలు, సీసీలు హాజరయ్యారు.

Updated Date - 2021-11-27T04:57:05+05:30 IST