ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
ABN , First Publish Date - 2021-10-21T05:51:59+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగిస్తున్న జగన్‌రెడ్డిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని టీడీపీ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బొలమోని రాములు ప్రశ్నించారు.

వనపర్తిటౌన్, అక్టోబరు 20: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగిస్తున్న జగన్‌రెడ్డిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని టీడీపీ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బొలమోని రాములు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కార్యాలయం, నా యకులపై వైసీపీ నాయకులు చేసిన దాడులను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి జగన్‌రెడ్డికి సద్బుద్ధి ప్రసాధించాలని కోరుతు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టిక ల్ 356ను అమలు చేయాలని కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి కొన సాగిస్తున్న అరాచక పాలనను ప్రశ్నిం చిన టీడీపీ నాయకులపై, పార్టీ కార్యాలయా లపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నామని అన్నారు. ఏదైన ప్రజాస్వామ్య దే శంలో చట్టాలను గౌరవిస్తు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి దాడులు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే వైసీపీకి ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నంది మల్ల అశోక్, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారద, రాష్ట్ర తెలుగు యువత నాయకులు జమీల్, ఏర్పుల రవి యాదవ్, ఎండీ గౌస్, రమేష్, రాష్ట్ర మైనారి టీ నాయకుడు దస్తగిరి, వహీద్, చిన్నయ్య యాదవ్, శ్రీను, నాగన్న యాదవ్, బాలు నాయుడు, ఖాదర్, డీ బాలరాజు, చుక్క సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.