నెల రోజుల్లోనే గొర్రెల పంపిణీ

ABN , First Publish Date - 2021-10-30T03:43:21+05:30 IST

ఉచిత గొర్రెల పం పిణీ పథకంలో మార్పులు జరగడం వల్ల గొర్రెల పెంపకందారులకు పంపిణీలో జాప్యం జరుగు తోందని పశుసంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

నెల రోజుల్లోనే గొర్రెల పంపిణీ
అమరచింతలో బీరప్ప దేవాలయంలో మాట్లాడుతున్న జేడీ డాక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి

పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి కాపరులకు హామీ


అమరచింత, అక్టోబరు 29: ఉచిత గొర్రెల పం పిణీ పథకంలో మార్పులు జరగడం వల్ల గొర్రెల పెంపకందారులకు పంపిణీలో జాప్యం జరుగు తోందని పశుసంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం అమరచింత బీరప్ప దేవాలయంలో మల్లికార్జున గొర్రెల పెంప కందారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావే శానికి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకంలో గ తంలో 53 యూనిట్లకు డీడీలు కట్టి గొర్రెల పెంప కందారులు నిరాశకు గురయ్యారని అన్నారు. ప్ర స్తుతం ఈ పథకంలో ప్రభుత్వం మార్పులు తీసు కురావడం వల్ల గొర్రెల పంపిణీ కార్యక్రమం ఆగి పోయిందన్నారు. పెంపకందారులకు మళ్లీ ఉచిత గొర్రెలు పంపిణీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు రావడంతో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో కాప రులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చు ట్టిందని తెలిపారు. గతంలో ఒక యూనిట్‌కు రూ.31,250 ప్రకారం 53 యూనిట్లకు డీడీలు కట్టా రన్నారు. ఆ పథకం మార్పుల వల్ల అదనంగా రూ.12,500 డీడీలు వెంటనే ఇచ్చినట్లయితే అంద రికీ ఒక నెల రోజుల్లోనే గొర్రెల పంపిణీ జరుగు తుందని జేడీ హామీ ఇచ్చారు. జిల్లాలో మొత్తం 396 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపా రు. జిల్లా అంతటా గొర్రెల పెంపకందారులు ఇప్ప టికే 246 మందికి గ్రౌండింగ్‌ అయ్యిందని తెలిపా రు. ఇంకా 150 యూనిట్లదారులందరూ ప్రభు త్వం నిర్ధేశించిన ప్రకారం అదనంగా రూ.12,500ల చొప్పున డీడీలు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నా రు. పెంపకందారులు అనుమానాలకు తావివ్వ కుండా పశు సంవర్థక శాఖాధికారులకు సహకరిం చాలని కోరారు. సమావేశంలో డాక్టర్‌ విజయ్‌కు మార్‌, మల్లికార్జున గొర్రెల పెంపకం దారుల సం ఘం అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి రఘు, కోశాధికారి గోపి, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ రాజ శేఖర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కల నర సింహులుగౌడ్‌, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్య క్షుడు నరేష్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ నాగభూషణంగౌడ్‌, జయసింహారెడ్డి, గొర్రెల పెంప కందారుల సంఘం పెద్దలు రాజన్న, ఇములన్న, నాగరాజు, మహేష్‌, అంజి, భరత్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-30T03:43:21+05:30 IST