కరోనా బాధితులకు పండ్లు పంపిణీ

ABN , First Publish Date - 2021-05-21T05:18:01+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను బీజేపీ నాయకులు గురు వారం పరామర్శించారు.

కరోనా బాధితులకు పండ్లు పంపిణీ
ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేస్తున్న బీజేపీ నాయకులు

జడ్చర్ల, మే 20 : ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను బీజేపీ నాయకులు గురు వారం పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్‌ ఆదేశాల మేరకు జడ్చర్ల మునిసిపాలిటీలోని ఆసుపత్రుల్లోని రోగులను పరామర్శించి, వారికి పండ్లు పంపిణీ చేశారు. మనోధైర్యంతో ఉంటే కరోనాను ఎదుర్కోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనంతవెంకట్‌రాంరెడ్డి, సాహితి, బాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎడ్ల రఘుగౌడ్‌ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-21T05:18:01+05:30 IST