డిజిటలైజేషన్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-11-29T04:07:36+05:30 IST

పేపర్‌ వర్క్‌ను తగ్గిస్తూ పోలింగ్‌ స్టేషన్‌ పూర్తి వివరాలను గరుడ యాప్‌ ద్వారా డిజిటలైజేషన్‌ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ పేర్కొన్నారు.

డిజిటలైజేషన్‌ చేయాలి
ఊట్కూర్‌లో బీఎల్‌వోలతో వివరాలు తెలుసుకుంటున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌

ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి 

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ 

ఊట్కూర్‌, నవంబరు 28 : పేపర్‌ వర్క్‌ను తగ్గిస్తూ పోలింగ్‌ స్టేషన్‌ పూర్తి వివరాలను గరుడ యాప్‌ ద్వారా డిజిటలైజేషన్‌ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ పేర్కొన్నారు. స్పెషల్‌ సమ్మరి రివిజన్‌లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, సెంట్రల్‌ ప్రైమరీ పాఠశాలలోని పోలింగ్‌ బూత్‌లో చేపట్టిన ఓటరు జాబితా నవీనీకరణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ డాక్టర్‌ చేతనతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ బీఎల్‌వోల కొత్త ఓటర్ల నమోదుకు కావల్సిన ఫారము, ఓటరు పేరు మార్పు, పోలింగ్‌ బూతు మార్పుతో పాటు మరణించిన వారి ఓటర్ల గుర్తింపును గరుడ యాప్‌లో నమోదు చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, ఇది వరకు సేకరించిన వివరాలను తహసీల్దార్‌ లేదా యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గరుడ యాప్‌ను బూత్‌ లేవల్‌ అధికారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేపర్‌ వర్క్‌ను తగ్గించి పోలిం గ్‌ స్టేషన్‌కు సంబంధించిన అక్షాంశ రేఖాం శ ఫొటోలు డిజిటల్‌ విధానం ద్వారా అప్‌ లోడ్‌ చేసేందుకు గరుడ యాప్‌ను రూపొందించిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ తిరుపతయ్య, సీఐ శంకర్‌ పాల్గొన్నారు.

ధన్వాడ : ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటరు నమోదు ప్రక్రియ స్పెషల్‌ డ్రైవ్‌ ఆదివారం కొనసాగింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరు నమోదు చేసుకున్నారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి, ఓటరు నమోదుపై బీఎల్‌వోలను అడిగి తెలుసుకున్నారు. ధన్వాడ మండల కేంద్రంతో పాటు మండలంలోని గోటూర్‌, కిష్టాపూర్‌, కొండాపూర్‌, కంసాన్‌పల్లి, మందిపల్లి, రాంకిష్టాయ్యపల్లి, చర్లపల్లి, గున్ముక్ల, ఎంనోన్‌పల్లి, మంత్రోన్‌పల్లి గ్రామాల్లో ఓటరు నమోదు స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగగా త హసీల్దార్‌ బాల్‌చ ందర్‌, గిర్దావరి అమ ర్‌, రామాంజనేయులు పర్యవేక్షించారు. కార్యక్ర మంలో బీఎల్‌వోలు బాలకృష్ణ, భాను, రాణి, భూదేవి పాల్గొన్నారు.

మాగనూరు : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చే సిన ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని నారా యణపేట ఆర్డీవో సీహెచ్‌ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మా ట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యు వతీయువకులు ఓటరు నమోదు చేసు కోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీ ల్దార్‌ తిరుపతయ్య, ఆర్‌ఐ నర్సింహులు, సర్పంచు రాజు, మారెప్ప, వీఆర్వోలు పాల్గొన్నారు.

మరికల్‌ : మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చేపట్టిన ఓటరు నమోదు ప్రక్రియ ఆదివారం రెండో రోజు తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వీఆర్వోల సంఘం అధ్యక్షుడు గోవర్ధన్‌ మాట్లా డుతూ రెండు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా జనవరి 1, 2022 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అదే విధంగా ఓటరు లిస్టులో తప్పులను సరిదిద్దుకోవచ్చు అన్నారు. ఆదివారం సెలవు దినమైనా జిల్లా వ్యాప్తంగా వీఆర్వోలందరూ విధులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం తొలగించిన వీఆర్వోలను వెంట నే విధుల్లోకి తీసుకొని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఎల్‌వోలు సుదర్మన్‌, లక్ష్మి, సుజాత, జయశ్రీ పాల్గొన్నారు



Updated Date - 2021-11-29T04:07:36+05:30 IST