దౌదర్‌పల్లి ప్లాట్ల జోలికి రావొద్దు

ABN , First Publish Date - 2021-12-08T05:03:41+05:30 IST

దౌదర్‌పల్లి దర్గా వద్ద ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లజోలికి రావద్దంటూ లబ్ధిదారులు మంగళవారం కూడా ధర్నా చేశారు.

దౌదర్‌పల్లి ప్లాట్ల జోలికి రావొద్దు
దౌదర్‌పల్లి దర్గా వద్ద ధర్నా చేస్తున్న లబ్ధిదారులు

- లబ్ధిదారుల డిమాండ్‌ 

- రెండో రోజు కొనసాగిన ధర్నా

గద్వాల రూరల్‌, డిసెంబరు 7 : దౌదర్‌పల్లి దర్గా వద్ద ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లజోలికి రావద్దంటూ లబ్ధిదారులు మంగళవారం కూడా ధర్నా చేశారు. ప్రభుత్వం పేదలకు పట్టాలు పంపిణీ చేసిన భూమిలో నర్సింగ్‌ కాలేజీ నిర్మాణానికి సన్నాహాలు చేస్తుండడంతో లబ్ధిదారులు సోమవారం ఆందోళన చేప ట్టారు. అధికారుల నుంచి సానుకూల స్పం దన రాకపోవడంతో రెండవ రోజు కూడా ధర్నా చేశారు. బీజేపీ నాయకులు బండల వెంకట్రాములు, రామాంజనేయులు, డిటీడీసీ నర్సింహ తదితరులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు మాట్లాడుతూ డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాట్లను పంపిణీ చేశారని, టీఆర్‌యస్‌ ప్రభు త్వం వచ్చిన తర్వాత రుణాలు మంజూరు చేయకపోవడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం, ఇచ్చిన జాగాను కూడా లాక్కోవడం సమంజసం కాదన్నారు. సమా చారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చచెప్పారు.


Updated Date - 2021-12-08T05:03:41+05:30 IST