జిల్లాలో ధరణి విజయవంతం

ABN , First Publish Date - 2021-10-30T04:37:02+05:30 IST

జిల్లాలో ధరణి పోర్టల్‌ విజయవంతం అయ్యిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు.

జిల్లాలో ధరణి విజయవంతం
ధరణికి ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు

 - వసంతోత్సవంలో కలెక్టర్‌ వెంకట్రావు


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), అక్టోబరు 29 :  జిల్లాలో ధరణి పోర్టల్‌ విజయవంతం అయ్యిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు. ధరణి పో ర్టల్‌ను దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి ప్రా రంభించి నేటితో సంవంత్సరం పూర్తయిన సంద ర్భంగా శుక్రవారం రెవెన్యూ సమావేశ మందిరంలో కేక్‌ కట్‌ చేశారు. ధరణి పోర్టల్‌ రెవెన్యూ పరిపాల నలో సురక్షితమైన, వివక్షలేని సేవలను అందించే వినూత్నమైనదని అన్నారు. జిల్లాలో ధరణి సమర్థ వంతంగా అమలవుతున్నందున అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, కలెక్టర్‌ కార్యాలయ సిబ్బందిని అభి నందించారు. ధరణి ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 46,122 స్లాట్స్‌ బుక్కయ్యాయని కలెక్టర్‌ తెలిపారు. 22,546 సేల్‌ ట్రాంజాక్షన్లు, 5,946 గిఫ్ట్‌ ట్రాంజాక్ష న్లు, 894 సక్సేషన్లు పూర్తి అయ్యాయని తెలిపారు. 7,560 మ్యుటేషన్లు, 7,129 భూ విషయాలపై వచ్చి న ఫిర్యాదులను, 1,711 ప్రొహిబిటెడ్‌ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి, అలాగే 1,762 కోర్టు కేసులకు సంబంధించిన ఫిర్యాదులను పరి ష్కరించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. వచ్చేనెల 8 నుంచి తహసీల్దారు కార్యాలయాల్లో ధరణి కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నామని తెలిపా రు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌ పవర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారా మారావు, రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు చెన్నకిష్టన్న, రాజగోపాల్‌, జేఏసీ అధ్య క్షుడు రాజీవ్‌రెడ్డి మాట్లాడారు. ఆర్‌డీఓ పద్మశ్రీ, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, సర్వేల్యాండ్‌ రికార్డుల ఏడీ శ్రీనివాసులు ఉన్నారు. ధరణిపై సాంస్కృతిక సారథి కళాబృందం వారు పాటలను వినిపించారు. 

Updated Date - 2021-10-30T04:37:02+05:30 IST