మైసమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-10-04T03:54:45+05:30 IST

భక్తులకు కొంగుబంగారంగా వెలసిన నాయినోనిపల్లి మైసమ్మ దేవత దర్శనం కోసం ఈ ఆదివారం భక్తులు పోటెత్తారు.

మైసమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
నాయినోనిపల్లి మైసమ్మ దేవతను దర్శనం చేసుకుంటున్న భక్తులు

పెద్దకొత్తపల్లి, అక్టోబరు 3: భక్తులకు కొంగుబంగారంగా వెలసిన నాయినోనిపల్లి మైసమ్మ దేవత దర్శనం కోసం ఈ ఆదివారం భక్తులు పోటెత్తారు. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల జిల్లాల నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆదివారం పదివేల మందికిపైగా భక్తులు మైసమ్మ దేవతను దర్శించుకొని తమతమ మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తుల నుంచి మైసమ్మ దేవతకు లక్షా 40వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో సత్యచంద్రారెడ్డి, చైర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌లు తెలిపారు. 


మైసమ్మ దేవతకు చింతలపల్లి జగదీశ్వర్‌రావు ప్రత్యేక పూజలు

 నాయినోనిపల్లి మైసమ్మ దేవతకు కొల్లాపూర్‌ నియోజకవర్గం సీనియర్‌ నాయకుడు చింతలపల్లి జగదీశ్వర్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం నాయినోనిపల్లి మైసమ్మ దేవతను దర్శించుకొని భక్తిశ్రద్ధలతో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. ఆయన వెంట అనుచరులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-04T03:54:45+05:30 IST