క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైదానాల అభివృద్ధి

ABN , First Publish Date - 2021-02-02T03:02:05+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహించేందుకు మైదానాలను అభివృద్ధి చేసి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎక్పైజ్‌, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైదానాల అభివృద్ధి
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ స్టేడియం మైదానం అభివృద్ధిపై అధికారులతో హైదరాబాద్‌లో సమీక్ష 


మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 1: గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహించేందుకు మైదానాలను అభివృద్ధి చేసి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎక్పైజ్‌, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో క్రీడల శాఖ అధికారులతో మహబూబ్‌నగర్‌ స్టేడియం మైదానం అభివృద్ధిపై సమీక్ష చేశారు. అభివృద్ధి నమూనాలను తయారు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రోత్సాహం అందించనున్నట్లు చెప్పారు. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే క్రీడాకారులకు కావలసిన మౌలిక వసతులను మైదానాల్లో కల్పించి, వారికి ప్రోత్సాహం అందిస్తామన్నారు. శిక్షణ ఇచ్చి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రాన్ని క్రీడాహబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో గ్రామీణ క్రీడాకారులకు పెద్దపీట వేస్తామన్నారు. 

Updated Date - 2021-02-02T03:02:05+05:30 IST