హత్యకేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-08-26T04:21:59+05:30 IST

పదిరోజుల క్రితం ఉండవల్లి మండలం అలంపూర్‌ చౌరస్తాలో జరిగిన హత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్టు చే శారు.

హత్యకేసులో నిందితుడి అరెస్టు
సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

- వివరాలు వెల్లడించిన ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌

ఎర్రవల్లిచౌరస్తా, ఆగ స్టు25: పదిరోజుల క్రితం ఉండవల్లి మండలం అలంపూర్‌ చౌరస్తాలో జరిగిన హత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్టు చే శారు. బుధవారం కో దండాపురం సీఐ కార్యా లయంలో ఏర్పాటు చేసి న విలేకర్ల సమావేశం లో జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌ వివరాలు వెల్లడించారు.  అలంపూర్‌ చౌరస్తాలో మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుండగా,  పెంచుల నర్సయ్య అనే వ్యక్తి వెళ్లి గొడవను ని వారించేందుకు ప్రయత్నించాడు. అయితే, పెం చుల నర్సయ్యకు, దావాని శివానందంకు మాట మాట పెరుగడంతో కోపాద్రిక్తుడైన శివానందం  నర్సయ్యపై సెంట్రింగ్‌ కట్టెతో దాడి చేయగా  అ క్కడికక్కడే కుప్పకూలాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సయ్య మృతి చెందాడు.  కుటుం బ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉండవల్లి పోలీసులు కేసును నమోదు చేసుకొని సీసీ ఫు టేజీ ఆధారంగా నిందితుడిని  అదుపులోకి తీసు కొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపా రు. సమావేశంలో శాంతినగర్‌ సీఐ వెంక టేశ్వరులు, కోదండాపురం, ఉండవల్లి ఎస్సైలు వెంకటస్వామి, జగన్‌మోహన్‌,  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-26T04:21:59+05:30 IST