ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిపేందుకే రుణ విస్తరణ

ABN , First Publish Date - 2021-10-21T05:18:34+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు రుణవిస్తరణ కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు తెలిపారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిపేందుకే రుణ విస్తరణ
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు

- కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు

- వివిధ బ్యాంకులు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో స్టాళ్ల ఏర్పాటు


మహబూబ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 20 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు రుణవిస్తరణ కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు తెలిపారు. బుధ వారం జిల్లా పరిషత్‌ మైదానంలో దాదాపు 15 బ్యాంకులు తమ స్టాళ్లు ఏర్పాటు చేసి బ్యాంకులు ప్రజలకు ఇస్తున్న సదుపాయాలను వివరించారు. ముఖ్యఅతిఽథిగా కలెక్టర్‌ వెంకట్రావు పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సమా వేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల కు వివరించేందుకు రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులు రుణాలు పొం ది లబ్ధిపొందాలని అన్నారు. ఈ రుణవిస్తరణ కార్య క్రమానికి డీఆర్‌డీఏ, ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్లకు చెందిన అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే ఈ కార్యక్ర మానికి రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి డీజీఎం సురేందర్‌ నాయక్‌ పాల్గొనడం సంతోషక రమని అన్నారు. కలెక్టర్‌ అన్ని స్టాళ్లను పరిశీలిం చారు. ముద్ర రుణాలతో పాటు ఇతర రుణాలపై కూడా అధికారులు అవగాహన కల్పిస్తారని తెలిపా రు. డీజీఎం సురేందర్‌ నాయక్‌ మాట్లాడుతూ బ్యాంకులు అందిస్తున్న సౌకర్యాలను ప్రజలు ఉప యోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 15 శాఖల బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


వైద్యారోగ్య శాఖలో డిప్యుటేషన్లు రద్దు చేయాలి 


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) : జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న అన్ని డిప్యు టేషన్లను రద్దు చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. బుధవా రం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయా న్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ 15 రోజుల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆరుగురు ప్రోగ్రాం ఆఫీసర్లకు బాధ్యతలు ఇవ్వాలని డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు. అంతేకాకుండా జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఈ 15 రోజుల పాటు ఆయా పీహెచ్‌సీలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కృష్ణ, డిప్యూటి డీఎంఅండ్‌హెచ్‌వో డా. శశికాంత్‌, ప్రోగ్రాం ఆఫీసర్లు  పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:18:34+05:30 IST