రోడ్డు పక్కన మృత శిశువు

ABN , First Publish Date - 2021-05-03T03:44:08+05:30 IST

మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామ సమీపంలో గ్రామానికి వచ్చే రవాదారి పక్కన ఉన్న గుంతలో ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది.

రోడ్డు పక్కన మృత శిశువు

ఉప్పునుంతల, మే 2: మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామ సమీపంలో గ్రామానికి వచ్చే రవాదారి పక్కన ఉన్న గుంతలో  ఆడ  శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం  రాత్రి ఎవరో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గ్రామ సమీపంలోని రవాదారి పక్కనే ఉన్న గుంతలో   వదిలిపెట్టి ఉండవచ్చు. ఆదివారం మధ్యాహ్నం గ్రామస్థులు చూసేసరికి  మృతి చెంది ఉంది. విషయం తెలుసుకున్న ఎస్సై రమేష్‌ పోలీసులను గ్రామానికి పంపి మృతి చెందిన శిశువును అచ్చంపేట ఆస్సుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.  సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శితో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాపు చేస్తు న్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతి చెందిన శివువు ఏ గ్రామానికి చెందిన విషయాలపై దర్యాపు చేయనున్నట్లు ఆయన తెలిపారు.   Updated Date - 2021-05-03T03:44:08+05:30 IST