దసరా జోష్‌

ABN , First Publish Date - 2021-10-15T05:27:02+05:30 IST

విజయ దశమి అన్నివిధా లుగా అందరికి కలిసిరావాలని జిల్లా వ్యాప్తంగా ప్రజలు శుక్ర వారం దసరా సంబురాలకు సిద్ధమయ్యారు.

దసరా జోష్‌
సొంత గ్రామాలకు వెళ్లేందుకు పాలమూరు బస్టాండ్‌లో బస్సుకు ఎగబడిన ప్రజలు

- వైభవంగా నిర్వహించేందుకు ప్రజల ఉత్సుకత 

- పండుగ ముందర పెరిగిన కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు 

-  ఉల్లి కిలో రూ.50, బీరకాయ రూ.80, టమాట రూ.40 8 కరోనా నిబంధనల సడలింపుతో భారీ  ఏర్పాట్లు

-  నేడు జడ్పీ మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా ఉత్సవాలు

 విజయ దశమి రోజు ఏ కార్యం తలపెట్టినా విజయం వరిస్తుందనే నమ్మకంతో ప్రజలు ఉదయాన్నే వారి ఇష్టదైవాలకు పూజలు చేసి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం శమీ వృక్షానికి పూజలు చేసి  శమీ పత్రాన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. దసరా పండుగలో పాలపిట్టకు ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది. విజయదశమి నాడు పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని విశ్వాసం. కరోనా కారణంగా గతేడాది దసరా సంబురాలకు దూరంగా ఉన్న ప్రజలు ఈ ఏడాది నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ఉత్సుకతతో ఉన్నారు.  సొంతగ్రామాల్లో వేడుకలు జరుపుకొనేందుకు పట్టణాల నుంచి పల్లెలకు జనం క్యూ కట్టారు. దీంతో బస్టాండ్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.  

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 14 :  విజయ దశమి అన్నివిధా లుగా అందరికి కలిసిరావాలని జిల్లా వ్యాప్తంగా  ప్రజలు శుక్ర వారం దసరా సంబురాలకు సిద్ధమయ్యారు. విజయ దశమి రోజు ఏ కార్యం తలపెట్టిన విజయం వరిస్తుందనే నమ్మకంతో ఉదయాన్నే వారి ఇష్టదైవాలకు పూజలు చేసి నూత న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం శమీ వృక్షానికి పూజలు చేసి  శమీ పత్రాన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చు కొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొంటారు. కరోనా కా రణంగా గతేడాది దసరా సంబురాలకు దూరంగా ఉన్న ప్ర జలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిం చాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఈ సమ యంలోనే కూరగాయలు, నిత్యావసర స రకుల ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధర సెంచరీ దాటింది. ధరలు ఇంతలా పెరిగి నా కరోనా తగ్గుముఖం పట్టడంతో దసరా ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకోవాలని పాలమూరు ప్రజలు ఉత్సుకత చూపుతున్నారు. గతేడాది కరోనా తిష్ఠ వేయడంతో ఏ ఇంట చూసినా కరోనా బంధు మిత్రుల సందడి కనిపించలేదు. ఎవరిని ముట్టుకున్నా ఏమౌవుతుందోననే భయంతో శమీ కూడా ఇచ్చి పుచ్చుకోలేదు. కరోనా మహ మ్మారి ఏడాదిన్నరగా విలయతాండవం చేసి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది దసరాను బంధుమిత్రులతో సంతోషంగా జరుపు కోనేందుకు సిద్ధమయ్యారు. గతేడాది బతుకమ్మ సంబురాలు, నవరాత్రి ఉత్సవాలకు దూరంగా ఉన్న పాలమూరు ప్రజానీకం ఈ ఏడాది రెట్టించిన ఉత్సా హంతో ఉత్సవాలు చేసుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరా న్నంటాయి. అదేవిధంగా దసరా ఉత్సవాలు, శమీ పూజ పెద్ద ఎత్తున చేసుకునేందుకు పల్లెలు, పట్టణవాసులు సిద్ధ్దమవుతున్నారు. సొంతగ్రామాల్లో దసరా జరుపుకొనేందుకు పట్టణాల నుంచి పల్లెలకు జనం క్యూకట్టారు. బస్టాండ్‌లు ప్ర యాణికులతో కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాల్లో కూడా చాలామంది వస్తుండటంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది.

 సందడిగా మారిన బజారు.. 

పాలమూరు, జడ్చర్ల పట్టణంలో పండగ సందడి నెలకొంది. గురువారం మార్కెట్‌లో నిత్యావసర సరకులు, కూరగాయలు, దుస్తులు కొనుగోలు చేసేందుకు పల్లెల నుంచి జనం పట్టణాలకు రావడం, పట్టణ ప్రజలు కూడా మార్కెట్‌కు రావడంతో బజార్‌లు రద్దీగా మారాయి.  రెడీమేడ్‌ దుకాణాలు రద్దీగా మారాయి.. కిరాణం సరుకుల కొనుగోళ్లు కూడా పెరిగాయి. ధరలు పెరిగినా పండుగ సంబురంలో జనం పెద్దఎత్తున సరకులు కొంటున్నారు. నూనె లు, పప్పుల ధరలు పెరిగాయి. కూరగాయల ధరలు కూడా  భగ్గుమంటున్నాయి. బీరకాయ కిలో రూ.80. బీర్నీస్‌ రూ.80, టమాట రూ. 40, ఉల్లిగడ్డరూ.50, అల్లం కిలో రూ100, ఎల్లిపాయ కిలో రూ.130, వంటనూనె రూ.160 పలుకుతోంది. 

నేడు దసరా ఉత్సవం 

పాలమూరులో శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్‌ మైదానంలో దసరా ఉత్సవం జరగనుంది. ఆర్య సమాజ్‌ మందిరం నుంచి ధ్వజదారి ఊరేగింపు ప్రారంభ మ వుతుంది. రాంమందిర్‌ చౌరస్తా, గడియారం, బస్టాండ్‌ల మీదుగా జిల్లా పరిషత్‌ మై దానం వద్దకు కళాకారులు, పట్టణ ప్రజలతో ఊరేగింపు వస్తుంది. అక్కడ బాణసం చా, రావణాసుర వధ కార్యక్ర మాలను పెద్దఎత్తున నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, పట్టణ ప్రముఖులు, ప్రజలు ఈ కార్యకమ్రంలో భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. Updated Date - 2021-10-15T05:27:02+05:30 IST