ఆశ వర్కర్లతో వెట్టి చాకిరీ

ABN , First Publish Date - 2021-06-23T04:50:46+05:30 IST

ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయకుండా వారి చేత రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తోందని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీత ఆవేద న వ్యక్తం చేశారు.

ఆశ వర్కర్లతో వెట్టి చాకిరీ
సమావేశంలో మాట్లాడుతున్న సునీత

- ఆశ వర్కర్స్‌ యూనియన్‌

 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీత

వనపర్తి టౌన్‌, జూన్‌ 22: ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయకుండా వారి చేత రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తోందని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీత ఆవేద న వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఐటీ యూ కార్యాలయంలో ఆశ వర్కర్ల జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ పేరుతో ఆశ వర్కర్లను మోసం చేస్తోందని, కనీస వేతనం పెంచి పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా కష్టకాలంలో ఆశ వర్క ర్లకు సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని, కరోనా పరీక్షలు ఆశలతో చేయించడం సరైన విధానం కాదన్నారు. కరోనాతో మరణించిన ఆశలకు ఎక్స్‌గ్రేషియా చెల్లిం చాలని, ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ఫిక్స్‌డ్‌ వేత నం రూ. 7500 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదనపు పనులు చేయించకూ డదని, చేయించినప్పుడు అదనపు వేతనం ఇవ్వాలని, లేనిపక్షంలో యూనియన్‌ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, కార్యదర్శి పుట్ట ఆంజనే యులు, ఆశ వర్కర్ల యూనియన్‌ నాయకులు భాగ్య, బుచ్చమ్మ, దేవమ్మ, జులేఖా బేగం, వినీల, శాంతమ్మ, మహేశ్వరి, సరోజ, మంజుల, రజిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T04:50:46+05:30 IST